విషాదం.. భర్త ప్రాణాల కోసం భార్య ‘సీఎం’ ఇంటి వద్ద..

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండగా.. మరణాలు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ సౌకర్యాలు లేక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కరోనా సోకిన తన భర్తను కాపాడుకునేందుకు ఓ మహిళ విఫలయత్నం చేసింది. WOMAN BEGS FOR BED OUTSIDE CM RESIDENCE In #Bengaluru, a woman was seen pleading for Covid bed for her […]

Update: 2021-05-06 09:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండగా.. మరణాలు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ సౌకర్యాలు లేక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కరోనా సోకిన తన భర్తను కాపాడుకునేందుకు ఓ మహిళ విఫలయత్నం చేసింది.

వివరాల ప్రకారం.. కర్ణాటక రామోహళ్లి సమీపంలోని చిక్కలూరుకు చెందిన ఓ మహిళ.. తన భర్తకు పడక ఏర్పాటు చేయమని ఏకంగా బెంగళూరులోని ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసానికి వెళ్లి వేడుకుంది. అలిసిపోయి రోడ్డు మీదనే కన్నీరు పెట్టుకుంది. దీంతో స్పందించిన అధికారులు.. ఎంఎస్​రామయ్య ఆస్పత్రిలో పడక ఏర్పాటు చేసి, ఆమెను అక్కడికి పంపారు. అయితే అప్పటికే భర్త మృతి చెందడంతో.. ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News