గంట వ్యవధిలో దంపతులు మృతి..

దిశ, స్టేషన్ ఘన్‌పూర్ : అనారోగ్యంతో భర్త మరణించగా ఆయన మృతిని జీర్ణించుకోలేక గంట వ్యవధిలోనే భార్య కూడా మృతి చెందింది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం చాగల్లు గ్రామంలో శనివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. చాగల్లు గ్రామానికి చెందిన మాదిరెడ్డి మాధవ రెడ్డి(95) అనారోగ్యంతో ఈరోజు ఉదయం మృతి చెందాడు. ఇన్ని రోజులు తోడుగా ఉన్న తన భర్త ఇకలేడు అనే విషయాన్ని తట్టుకోలేక పోయిన మాదిరెడ్డి సుగుణమ్మ(90) గంట వ్యవధిలోనే […]

Update: 2021-05-29 04:36 GMT
గంట వ్యవధిలో దంపతులు మృతి..
  • whatsapp icon

దిశ, స్టేషన్ ఘన్‌పూర్ : అనారోగ్యంతో భర్త మరణించగా ఆయన మృతిని జీర్ణించుకోలేక గంట వ్యవధిలోనే భార్య కూడా మృతి చెందింది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం చాగల్లు గ్రామంలో శనివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. చాగల్లు గ్రామానికి చెందిన మాదిరెడ్డి మాధవ రెడ్డి(95) అనారోగ్యంతో ఈరోజు ఉదయం మృతి చెందాడు.

ఇన్ని రోజులు తోడుగా ఉన్న తన భర్త ఇకలేడు అనే విషయాన్ని తట్టుకోలేక పోయిన మాదిరెడ్డి సుగుణమ్మ(90) గంట వ్యవధిలోనే తుది శ్వాస విడిచింది. ఈ విషాదకరమైన ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ సారంగపాణి గ్రామ నాయకులు కుమార్, నరసింహారెడ్డి, రాజేష్, నాగరాజు, రవీందర్, శ్రీధర్, విజేందర్, ప్రభాకర్, నాగయ్య మృతిచెందిన దంపతులకు నివాళ్లు అర్పించడమే కాకుండా, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Tags:    

Similar News