ఆ భూములు లాక్కోవాల‌ని చూస్తే మాత్రం..

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను నేటి పాలకులు, ప్రభుత్వ అధికారులు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నార‌ని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధర్యంలో ఖ‌మ్మం జిల్లా కేంద్రంలోని నిరాహార దీక్ష చేప‌ట్టారు. సోమ‌వారం నిర్వ‌హించిన ఈ ధ‌ర్నాలో పెద్ద సంఖ్య‌లో మ‌ద్ద‌తుదారులు పాల్గొన్నారు. పక్కా గృహాలు, మూడెకరాల భూమి కోసం నిరాహార దీక్షల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు దీక్ష జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన […]

Update: 2020-08-31 08:22 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను నేటి పాలకులు, ప్రభుత్వ అధికారులు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నార‌ని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధర్యంలో ఖ‌మ్మం జిల్లా కేంద్రంలోని నిరాహార దీక్ష చేప‌ట్టారు. సోమ‌వారం నిర్వ‌హించిన ఈ ధ‌ర్నాలో పెద్ద సంఖ్య‌లో మ‌ద్ద‌తుదారులు పాల్గొన్నారు.

పక్కా గృహాలు, మూడెకరాల భూమి కోసం నిరాహార దీక్షల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు దీక్ష జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్ర‌కారం… మూడెకరాల భూమి పంపిణీ అమలు చేయాల‌ని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు గ‌త ప్ర‌భుత్వాలు అంద‌జేసిన భూముల‌ను లాక్కోవాల‌ని చూస్తే మాత్రం ప్ర‌తిఘ‌ట‌న ఎదుర్కొవ‌ల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

Tags:    

Similar News