‘దేశంలో ఆక‌లి చావులు… ఆర్థిక పురోగ‌తి ప‌డిపోతోంది’

దిశ ప్రతినిధి, వరంగ‌ల్ : ప్రపంచంలోని అన్ని వ్యవ‌స్థల‌ను కరోనా కుదిపేసింద‌ని, భార‌త్‌లోని అనేక ప్రధాన వ్యవ‌స్థలు కోలుకోని విధంగా దెబ్బతిన్నాయ‌ని న్యూఢిల్లీలోని జామియామిలియా యూనివ‌ర్సిటీ రాజ‌నీతిశాస్త్రం మాజీ విభాగాధిప‌తి, ప్రొఫెస‌ర్ రుంకీ బ‌సు తెలిపారు. తెలంగాణ జ‌న‌వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హంట‌ర్ రోడ్డులోని మాజీ మంత్రి పురుషోత్తమ‌రావు నివాసం నుంచి క‌న్వీన‌ర్ త‌క్కెళ్లప‌ల్లి రాము ఆధ్వర్యంలో కొవిడ్ త‌ద‌నంన‌త‌రం భార‌త‌దేశంలో ప్రజాస్వామ్యం.. ప్రభుత్వ విధానాలు-స‌వాళ్లు అనే అంశంపై జూమ్ స‌ద‌స్సు జ‌రిగింది. ఈస‌ద‌స్సులో రుంకీబ‌సు ముఖ్య […]

Update: 2021-07-04 11:25 GMT

దిశ ప్రతినిధి, వరంగ‌ల్ : ప్రపంచంలోని అన్ని వ్యవ‌స్థల‌ను కరోనా కుదిపేసింద‌ని, భార‌త్‌లోని అనేక ప్రధాన వ్యవ‌స్థలు కోలుకోని విధంగా దెబ్బతిన్నాయ‌ని న్యూఢిల్లీలోని జామియామిలియా యూనివ‌ర్సిటీ రాజ‌నీతిశాస్త్రం మాజీ విభాగాధిప‌తి, ప్రొఫెస‌ర్ రుంకీ బ‌సు తెలిపారు. తెలంగాణ జ‌న‌వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హంట‌ర్ రోడ్డులోని మాజీ మంత్రి పురుషోత్తమ‌రావు నివాసం నుంచి క‌న్వీన‌ర్ త‌క్కెళ్లప‌ల్లి రాము ఆధ్వర్యంలో కొవిడ్ త‌ద‌నంన‌త‌రం భార‌త‌దేశంలో ప్రజాస్వామ్యం.. ప్రభుత్వ విధానాలు-స‌వాళ్లు అనే అంశంపై జూమ్ స‌ద‌స్సు జ‌రిగింది. ఈస‌ద‌స్సులో రుంకీబ‌సు ముఖ్య అతిథిగా పాల్గొని కీల‌కోప‌న్యాసం చేశారు. కొవిడ్‌ను ఎదుర్కొవ‌డంలో భార‌త ప్రభుత్వం అనేక విష‌యాల్లో వైఫ‌ల్యం చెందింద‌ని అన్నారు. వైద్య స‌దుపాయాల క‌ల్పన‌లో విఫ‌లం చెంద‌డంతో మ‌ర‌ణాల సంఖ్య పెరిగింద‌ని చెప్పారు.

కొవిడ్ కార‌ణంగా ఆర్థిక వ్యవ‌స్థలు కుప్పకూల‌డంతో దేశ ఆర్థిక‌ పురోగ‌తి రేటు మూడు ద‌శ‌బ్దాల క్రితం నాటి ఫ‌లితాల‌ను చూడాల్సి వ‌స్తోంద‌ని చెప్పారు. ఆక‌లి చావులు పెరుగుతున్నాయ‌ని, ఇది మంచి ప‌రిణామం కాద‌ని అన్నారు. దేశ ప్రజ‌ల‌ను ఆదుకోవ‌డానికి, ఆర్థిక ప‌రిస్థితుల‌ను మెరుగు ప‌ర‌చ‌డానికి కేంద్ర ప్రభుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను స‌మ‌గ్రంగా అమ‌లు చేయాల‌ని సూచించారు. ఈ స‌ద‌స్సులో ఆకుతోట శ్రీనివాస్‌, డాక్టర్ కొట్టే భాస్కర్‌, వెంక‌ట్రాజం గౌడ్‌, ర‌ఘుకుమార్‌, ర‌మారోహిణి, బి. రామ్మూర్తి, ర‌వీంద‌ర్‌రావు, సోమ‌రాతి భిక్షప‌తి, సుద‌ర్శన్‌, స్వాతి మిశ్రా, మ‌ధుకుమార్‌, పెండ్లి అశోక్‌బాబు, ప్రొఫెస‌ర్ బ‌ల‌రాములు, సంజీవ‌రెడ్డి, ఎడ్ల ప్రభాక‌ర్‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News