వివాదంలో TRS నేతలు.. కేసీఆర్ ఉద్దేశాన్ని తుంగలో తొక్కారంటూ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మీటింగ్ ఈనెల 25న హైటెక్స్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్లీనరీకి వేల సంఖ్యలో ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్లు ఇప్పటికే పార్టీ ప్రకటించింది. వీరికి సంబంధించి భోజన వసతిని కూడా భారీగా ఏర్పాటు చేసినట్లు తెలిసిందే. ఈ ఏర్పాట్లను కేటీఆర్ శనివారం పరిశీలించారు. అయితే, మాధాపూర్ లో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లీనరీకి వచ్చే వారి వాహనాల పార్కింగ్ […]
దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మీటింగ్ ఈనెల 25న హైటెక్స్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్లీనరీకి వేల సంఖ్యలో ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్లు ఇప్పటికే పార్టీ ప్రకటించింది. వీరికి సంబంధించి భోజన వసతిని కూడా భారీగా ఏర్పాటు చేసినట్లు తెలిసిందే. ఈ ఏర్పాట్లను కేటీఆర్ శనివారం పరిశీలించారు. అయితే, మాధాపూర్ లో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లీనరీకి వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం హైటెక్స్ పక్కనే ఉన్న పచ్చటి ప్రదేశాన్ని ధ్వంసం చేశారు.
భారీగా తరలివచ్చే వాహనాల పార్కింగ్ కోసం వందలాది వృక్షాలను నరికేశారు. దీంతో నెటిజన్లు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. గ్రీన్ చాలెంజ్ అంటూ చెట్లు పెంచమనే మీ పార్టీనే ఇలా చెట్లను నరికేస్తారా అంటూ మండిపడుతున్నారు. దీనికి మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ ను ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన హరితహారం ఉద్దేశాన్ని టీఆర్ఎస్ నాయకులే తుంగలో తొక్కారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో హరితహారం మొక్కలు నరికేసిన వారికి, పశువులు తింటే వాటి యజమానులకు ఫైన్లు వేసిన దాఖలాలు ఉన్నాయి. మరి ఇప్పుడు సొంత నాయకులే అన్ని చెట్లను నరికేస్తే వారిపై పెద్దలు యాక్షన్ తీసుకుంటారా? లేక మనవాళ్లే అని వదిలేస్తారా? అనే చర్చ మొదలైంది.
https://twitter.com/vinay_vangala/status/1451742143005921282?s=20