విత్తనాలు సరే.. మరి భౌతిక దూరం ఏదీ?
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వందలాది మంది రైతులు సోయాబీన్ విత్తనాల కోసం గుమిగూడారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తోన్న తరుణంలో రైతులు ఎవ్వరూ కనీస నిబంధనలు పాటించలేదు. విత్తనాలు దొరికితే చాలు అనుకున్నారు రైతులంతా. అధికారులు కూడా కనీస ఏర్పాట్లు చేయలేదు. విత్తనాల కోసం రైతులు ఇలా గుమిగూడితే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అలాగే మొగుడంపల్లిలోనూ విత్తనాల టోకెన్ల కోసం రైతులు బారులు […]
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వందలాది మంది రైతులు సోయాబీన్ విత్తనాల కోసం గుమిగూడారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తోన్న తరుణంలో రైతులు ఎవ్వరూ కనీస నిబంధనలు పాటించలేదు. విత్తనాలు దొరికితే చాలు అనుకున్నారు రైతులంతా. అధికారులు కూడా కనీస ఏర్పాట్లు చేయలేదు. విత్తనాల కోసం రైతులు ఇలా గుమిగూడితే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అలాగే మొగుడంపల్లిలోనూ విత్తనాల టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు. అక్కడ కూడా భౌతిక దూరం పాటించిన దాఖలాలు లేవు.