బడిలో పిల్లలను అవమానించడం నేరమే..!

దిశ, వెబ్‌డెస్క్ : పాఠశాలల్లో చిన్న పిల్లలను బహిరంగంగా అవమానించడం, వారితో దురుసుగా ప్రవర్తించడం వంటివి నేరంగా పరిగణించాలని కేరళ బాలల హక్కుల కమిషన్ సంచలన ఆదేశాలు జారీచేసింది.వయనాడ్‌ జిల్లాలోని ఓ పాఠశాలలో తొమ్మిదేళ్ల బాలుడిని హేర్ స్టైల్ విషయమై 800 మంది విద్యార్థులున్న ఆడిటోరియంలో ఉపాధ్యాయులు అవమానకరంగా మాట్లాడారు. ఈ విషయంపై బాలుడి తల్లిదండ్రులు బాలల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. టీచర్లు ఎందుకు పిల్లాడితో అవమానకరంగా మాట్లాడాల్సి వచ్చిందనే విషయంపై విచారణ జరిపిన చైల్డ్ రైట్స్ […]

Update: 2020-12-13 03:13 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పాఠశాలల్లో చిన్న పిల్లలను బహిరంగంగా అవమానించడం, వారితో దురుసుగా ప్రవర్తించడం వంటివి నేరంగా పరిగణించాలని కేరళ బాలల హక్కుల కమిషన్ సంచలన ఆదేశాలు జారీచేసింది.వయనాడ్‌ జిల్లాలోని ఓ పాఠశాలలో తొమ్మిదేళ్ల బాలుడిని హేర్ స్టైల్ విషయమై 800 మంది విద్యార్థులున్న ఆడిటోరియంలో ఉపాధ్యాయులు అవమానకరంగా మాట్లాడారు.

ఈ విషయంపై బాలుడి తల్లిదండ్రులు బాలల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. టీచర్లు ఎందుకు పిల్లాడితో అవమానకరంగా మాట్లాడాల్సి వచ్చిందనే విషయంపై విచారణ జరిపిన చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు స్కూల్ యాజమాన్యంపై సీరియస్ అయ్యారు. ఇక మీదట విద్యార్థులను అవమానించేలా ఏదైనా చర్యలకు దిగితే వారిపై నేరపూరితమైన కేసులు పెట్టాలని కేరళ ప్రభుత్వ యంత్రాగాన్ని ఆదేశించారు.

Tags:    

Similar News