రైడర్స్ ముందు భారీ స్కోరు

దిశ, వెబ్‌డెస్క్: అబుదాబి షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 54 బంతుల్లోనే 80 పరుగులు చేసి పరుగుల వరద పారించాడు. అయితే, రోహిత్ శర్మకు తోడుగా టాప్ ఆర్డర్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు జోడించడంతో స్కోర్ అమాంతం పెరిగింది. వీరికి ఆసరాగా మిగతా బ్యాట్స్‌మెన్లు తమవంతుగా కృషి చేయడంతో ముంబై ఇండియన్స్ 195 […]

Update: 2020-09-23 10:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: అబుదాబి షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 54 బంతుల్లోనే 80 పరుగులు చేసి పరుగుల వరద పారించాడు. అయితే, రోహిత్ శర్మకు తోడుగా టాప్ ఆర్డర్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు జోడించడంతో స్కోర్ అమాంతం పెరిగింది. వీరికి ఆసరాగా మిగతా బ్యాట్స్‌మెన్లు తమవంతుగా కృషి చేయడంతో ముంబై ఇండియన్స్ 195 పరుగులు చేయగలిగింది. దీంతో 196 పరుగుల భారీ టార్గెట్‌ను కేకేఆర్‌ ముందుంచింది.

ముంబై ఇన్నింగ్స్:

తొలుత ఓపెనింగ్‌కు దిగిన క్వింటెన్ డీకాక్ (1) పరుగు మాత్రమే చేసి స్కోర్ బోర్డు 8 వద్ద శివమ్ మవి బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అవ్వడం ముంబై అభిమానులను నిరుత్సాహపరిచింది. అయినప్పటికీ రోహిత్ శర్మ తనదైన శైలిలో నిలకడగా రాణిస్తూ స్కోర్ బోర్డు ముందుకు తీసుకెళ్లాడు. ఇదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ క్రీజులో కుదురుకొని రోహిత్‌ శర్మకు మంచి భాగస్వామ్యం అందించాడు. ఆ తర్వాత 92 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ (47) నరైన్ బౌలింగ్‌లో రన్ ఔట్ అయ్యాడు.

ఇక మూడో స్థానంలో వచ్చిన సౌరబ్ తివారి 21 జోడించి.. 147 పరుగుల వద్ద నరైన్ బౌలింగ్‌‌లో కమ్మిన్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ముందు నుంచే మంచి ఫామ్‌ కొనసాగిస్తున్న రోహిత్ శర్మ.. హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. సెంచరీ వైపు దూసుకెళ్తున్న సమయంలో.. శివం మవి వేసిన బౌలింగ్ లో బౌండరీ కొట్టబోయి 177/4 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు.

ఇక మిడిలార్డర్‌లో వచ్చిన హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 18 పరుగులు చేసి ఊపు మీద ఉన్న సమయంలోనే రస్సెల్ బౌలింగ్‌లో 180 పరుగుల వద్ద హిట్ వికెట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కీరన్ పోలార్డ్.. క్రునాల్ పాండ్యా మిగతా ఇన్నింగ్స్ పూర్తి చేసి.. 196 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ముందుంచారు.

అయితే, కేకేఆర్‌లో యువ బౌలర్ శివం మవి రెండు కీలక వికెట్లు( క్వింటెన్ డీకాక్, రోహిత్ శర్మ) వికెట్లు పడగొట్టడం గమనార్హం. సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ తలో వికెట్ తీసుకున్నారు. అయితే, రైడర్స్ ముందు ఊహించినట్టుగానే ముంబై ఇండియన్స్ భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

Tags:    

Similar News