టీఆర్ఎస్‌లో భారీ చేరికలు..

దిశ, ఉట్నూర్ : కాంగ్రెస్ పార్టీ నాయకుడు జాధవ్ శ్రీరామ్ దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో 500 మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్‌ను వీడిన జాధవ్ శ్రీరామ్ ను గులాబీ కండువా కప్పి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా జాధవ్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈరోజు దేశంలో ఎక్కడ జరగనటువంటి అభివృద్ధి మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టుతుందని అందుకే టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నానని అన్నారు. […]

Update: 2021-08-18 08:11 GMT

దిశ, ఉట్నూర్ : కాంగ్రెస్ పార్టీ నాయకుడు జాధవ్ శ్రీరామ్ దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో 500 మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్‌ను వీడిన జాధవ్ శ్రీరామ్ ను గులాబీ కండువా కప్పి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా జాధవ్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈరోజు దేశంలో ఎక్కడ జరగనటువంటి అభివృద్ధి మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టుతుందని అందుకే టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నానని అన్నారు.

దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో రైతులను రాజు చేశారని, ప్రతి ఇంటి ఆడబిడ్డ పెళ్లికి ఒక లక్ష పదహారు వేళ రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఇస్తున్నామన్నారు. 57 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తున్నామని, మిషన్ భగీరథ వల్ల ప్రతి ఒక్క గిరిజన ఆదివాసీ గూడాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. 500 జనాభా కల్గిన తండాలను, ఆదివాసిగూడలను ప్రత్యేక గ్రామపంచాయతీ చేశారని తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోడం నగేష్, రాష్ట్ర డెయిరీ చైర్మన్ లోక భూమా రెడ్డి, ఎంపీపీ పంద్రా జైవంత్ రావు, వైస్ ఎంపీపీ బాలాజీ, ప్యాక్స్ చైర్మన్ ఎస్‌పీ రెడ్డి, లక్కేరావు రాం నాయక్, జగ్ జీవన్ ప్రభాకర్ రెడ్డి, రాం కిషన్, తుకారం, అజిమోద్దీన్, మండల అధ్యక్షుడు సింగరే భారత్, కాంబ్లే, ప్రజ్ఞాషీల్, ధరణి, రాజేష్, రాజు, సర్పంచ్ లు ఎంపీటీసీ లు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News