వేలాది ఎకరాల్లో వరి పంటకు నష్టం
దిశ, నారాయణఖేడ్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటలు దెబ్బతిన్నాయని బుధవారం రైతులు ఆందోళన చెందారు. నారాయణఖేడ్ మండలం మిట్య నాయక్ తండా, ర్యాకల్, తుర్కపల్లి, పోతన్ పల్లి, గంగా పూర్, సంజీవనరావ్ పేట్ తదితర గ్రామాల్లో వర్షం పడి వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. వారం రోజుల్లో చేతికి వచ్చే సమయంలో పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీరు […]
దిశ, నారాయణఖేడ్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటలు దెబ్బతిన్నాయని బుధవారం రైతులు ఆందోళన చెందారు. నారాయణఖేడ్ మండలం మిట్య నాయక్ తండా, ర్యాకల్, తుర్కపల్లి, పోతన్ పల్లి, గంగా పూర్, సంజీవనరావ్ పేట్ తదితర గ్రామాల్లో వర్షం పడి వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. వారం రోజుల్లో చేతికి వచ్చే సమయంలో పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నష్టాన్ని అంచనా వేసి తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.