బన్నీ డ్యాన్స్‌కు హృతిక్ ఫిదా
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ దక్షిణాది చిత్రపరిశ్రమపై అభిమానాన్ని వ్యక్తపరిచారు. చెన్నైలో రాడో స్విట్జర్లాండ్‌కు లాంచింగ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. తర్వాత ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సౌత్ ఇండియన్ సినిమాల్లో టెక్నికాలజీ వినియోగించే తీరు ఇష్టమని.. అది తెలుసుకునేందుకు అసిస్టెంట్‌గా అయినా పని చేస్తా అని చెప్పారు హృతిక్. డ్యాన్స్‌ను ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలని .. ఎక్స్ప్రెషన్ అతి ముఖ్యమని చెప్పారు. అలాంటప్పుడు స్టెప్ రాంగ్ అయినా సరే చక్కగా కనిపిస్తుందని […]
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ దక్షిణాది చిత్రపరిశ్రమపై అభిమానాన్ని వ్యక్తపరిచారు. చెన్నైలో రాడో స్విట్జర్లాండ్‌కు లాంచింగ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. తర్వాత ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సౌత్ ఇండియన్ సినిమాల్లో టెక్నికాలజీ వినియోగించే తీరు ఇష్టమని.. అది తెలుసుకునేందుకు అసిస్టెంట్‌గా అయినా పని చేస్తా అని చెప్పారు హృతిక్. డ్యాన్స్‌ను ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలని .. ఎక్స్ప్రెషన్ అతి ముఖ్యమని చెప్పారు. అలాంటప్పుడు స్టెప్ రాంగ్ అయినా సరే చక్కగా కనిపిస్తుందని టిప్స్ ఇచ్చాడు. దక్షిణాదిన అల్లు అర్జున్, విజయ్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమన్న హృతిక్…. బన్నీ డ్యాన్స్ ఎనర్జిటిక్‌గా, ఇన్స్పైరెబుల్గా ఉంటుందన్నాడు. విజయ్ డ్యాన్స్ చూస్తే… డైట్ సీక్రెట్ తెలుసుకోవాలని అనిపిస్తుందని… ఎనర్జీ లెవల్ అంత సూపర్బ్‌గా ఉంటుందని కాంప్లిమెంట్ ఇచ్చారు.
ఒక సినిమా కథ విన్నాక 30 సెకన్లలోనే సైన్ చేస్తానని తెలిపిన హృతిక్… ఒక వేళ ఆ టైమ్ దాటిందంటే సినిమా చేయననే అర్ధం అన్నాడు. పాన్ ఇండియా మూవీ చేయాలనే ఆలోచన లేదు కానీ… దేవుడు, ప్రేక్షకులు ఆశీర్వదిస్తే తప్పకుండా ఆ ఛాన్స్ వస్తుందని నమ్ముతానని చెప్పారు. నా జీవితంలో నేను తీసుకున్న అతిపెద్ద నిర్ణయం యాక్టర్ కావాలని కోరుకోవడమే అన్నారు. ‘కోయి మిల్ గయా’ సినిమా షూటింగ్ అయిపోయినప్పుడు చాలా బాధపడ్డానని… ఆ చిత్ర యూనిట్, క్యారెక్టర్‌తో ఉన్న అనుబంధం అలాంటిదని తెలిపారు హృతిక్.
Tags : Hrithik Roshan, Allu Arjun, Vijay, Bunny