త్వరలో హృతిక్ డిజిటల్ ఎంట్రీ?
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా సినిమాల రిలీజ్ ఆగిపోవడంతో వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో స్టార్ హీరో, హీరోయిన్లు సైతం సిరీస్‌లకు సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే హృతిక్ కూడా ఓ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంగ్లీష్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ను హిందిలో రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. దిశా పటానీ, టబు లీడ్ రోల్స్‌లో కనిపించబోతున్న […]
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా సినిమాల రిలీజ్ ఆగిపోవడంతో వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో స్టార్ హీరో, హీరోయిన్లు సైతం సిరీస్‌లకు సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే హృతిక్ కూడా ఓ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇంగ్లీష్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ను హిందిలో రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. దిశా పటానీ, టబు లీడ్ రోల్స్‌లో కనిపించబోతున్న ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారం కానుందట. అంతేకాదు దీన్ని అన్ని భారతీయ భాషల్లోనూ డబ్ చేయబోతున్నారని సమాచారం.
ఇక హృతిక్ త్వరలో క్రిష్ 4 చేయబోతున్నారు. తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో రానున్న సినిమాలో ‘కోయి మిల్ గయా’ చిత్రంలోని ఏలియన్ జాదు మళ్లీ కనిపించబోతోందని సమాచారం.