ఇంటర్నెట్ డేటా సేవ్ చేయడానికి మార్గాలు
దిశ వెబ్ డెస్క్: దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది ‘‘వర్క్ ఫ్రమ్ హోమ్ ’’ చేస్తున్నారు. దాంతో సాధారణ పరిస్థితుల కన్నా.. ఈ టైమ్ లో ఇంటర్నెట్ డేటా ఎక్కువగా ఖర్చవుతోంది. యథేచ్ఛగా డేటా వాడేస్తే.. భవిష్యత్తులో ఇంటర్నెట్ కు కష్టాలు తప్పవు. ఇప్పటికే వాట్సాప్.. యూజర్లు పెట్టే స్టేటస్ నిడివిని తగ్గించింది. యూట్యూబ్ కూడా డేటాను సేవ్ చేయడానికి తమ వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీని తగ్గించింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ […]
దిశ వెబ్ డెస్క్: దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది ‘‘వర్క్ ఫ్రమ్ హోమ్ ’’ చేస్తున్నారు. దాంతో సాధారణ పరిస్థితుల కన్నా.. ఈ టైమ్ లో ఇంటర్నెట్ డేటా ఎక్కువగా ఖర్చవుతోంది. యథేచ్ఛగా డేటా వాడేస్తే.. భవిష్యత్తులో ఇంటర్నెట్ కు కష్టాలు తప్పవు. ఇప్పటికే వాట్సాప్.. యూజర్లు పెట్టే స్టేటస్ నిడివిని తగ్గించింది. యూట్యూబ్ కూడా డేటాను సేవ్ చేయడానికి తమ వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీని తగ్గించింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లు కూడా డేటా సేవింగ్ బాటలో నడుస్తున్నాయి. మరి ఇంటర్నెట్ డేటాను మనం ఎలా సేవ్ చేయవచ్చు.
ప్రస్తుత ప్రపంచంలో.. ఇంటర్నెట్ లేకపోతే.. ఎన్నో పనులు ఆగిపోతాయాన్నది కాదనలేని వాస్తవం. ఏ చిన్నపనికైనా మనం నెట్ ను వినియోగించే పరిస్థితి ఏర్పడింది. మన దేశంలో ఒక నెటిజన్ … నెలకు 11 జీబీల డేటాను వినియోగిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. సాధారణ రోజుల్లోనే అంతా డేటా ఉపయోగిస్తే.. ప్రస్తుతం అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయంలో డేటా వినియోగం అంతకంత రెట్టింపు అవుతుందని వేరే చెప్పాలా! విపరీతంగా డేటా ఖర్చయితే.. భవిష్యత్తులో మనకే చాలా కష్టం.
వీడియో క్వాలిటీ తగ్గించుకోవాలి:
ఇంట్లోనే ఉండటం వల్ల పాటలు, సినిమాలు, వినోద కార్యక్రమాలు చూడటానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటాం. అయితే.. ఏవీ చూసినా.. హెచ్ డీ, 4కే వీడియోల్ని చూడటం తగ్గించుకోవాలి. ఒక సర్వే ప్రకారం యూట్యూబ్ లో చూసే వీడియోల కోసమే మన దేశంలో ఎక్కువ డేటా ఖర్చు చేస్తున్నారని తేలింది. యూ ట్యూబ్ లో అప్ లోడింగ్ కు దూరంగా ఉండాలి. అంతేకాదు లైవ్ వీడియోస్ కు డేటా మామూలు కన్నా చాలా ఎక్కువగా, తొందరగా ఖర్చు అవుతుంది. అందుకే ఆఫ్ లైన్ వీడియోలకు ప్రాధాన్యం ఇవ్వాలి. డౌన్ లోడ్ క్వాలిటీ సెట్టింగ్స్ లో.. జనరల్ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకుంటే.. కొంత డేటా సేవ్ అవుతుంది.
ప్రిఫర్ ఆఫ్ లైన్ వీడియో గేమ్స్:
క్వారంటైన్ టైమ్ లో .. వీడియో గేమ్స్ ఆడే వారి సంఖ్య కూడా బాగా పెరిగినట్లు ఓ సర్వే ప్రకారం తెలిసింది. గేమింగ్ ఆడే వారి సంఖ్య 75 శాతం పెరిగింది. వీడియో గేమ్స్ క్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటి కోసం డేటా ఎక్కువగా అవసరం అవుతుంది. అందుకే ఆన్ లైన్ వీడియో గేమ్స్ కంటే ఆఫ్ లైన్ గేమ్స్ కు ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది. వాట్సాప్ లోనూ ఆటో డౌన్ లోడ్ ఫీచర్ ని డిసేబుల్ చేసుకుంటే.. అనవసరమైన వీడియోలన్నీ డౌన్ లోడ్ కాకుండా చూసుకోవచ్చు.
అవే ఎక్కువగా చూస్తున్నారు:
సోషల్ మీడియా వాడకంలో ఎలాంటి మార్పు లేనప్పటికీ .. కుకింగ్, ఫిట్ నెస్, యోగా, ఎంటర్ టైన్మెంట్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు. అంతేకాదు నగరాలు, పట్టణాల కన్నా.. గ్రామాల్లోనే ఎక్కువగా నెట్ వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కరోనాపై వచ్చే కథనాలను కూడా ఎక్కువగా చూస్తున్నారు. దానివల్ల లేనిపోని ఆందోళనకు గురవుతున్నారు. కావున ఎటువంటి ఆధారం లేని వీడియోలను చూడటం మానేయడం ఎంతో ఉత్తమం. ఇలాంటి ఆపత్కాలంలో డేటా వినియోగాన్ని ఎంత తగ్గించుకుంటే.. అంత మంచిది. ఎవరూ లేనప్పుడు ఫోన్ వాడటం ఓకే కానీ.. ఈ లాక్ డౌన్ టైమ్ లో కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉంటారు కావున.. ఇలాంటి మంచి సమయాన్ని.. వారితో గడపడానికి కేటాయించండి. కథలు, ఇండోర్ గేమ్స్ తో ఫోన్ కు చెక్ చెప్పండి.
ఇంటర్నెట్ వాడకాన్ని తగ్గించుకుని డేటాను పొదుపు చేయడం ద్వారా చాలా కీలకమైన రంగాలపై ప్రభావం పడకుండా కాపాడొచ్చు. చాలా ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో లేరు. దాంతో ఔట్ పేషెంట్ వారి కోసం వీడియో కాలింగ్ సదుపాయాన్ని కల్పించారు వైద్యులు. జియో ట్యాగింగ్ ను ఉపయోగించి క్వారంటైన్ వ్యక్తుల కదలికలను మానిటర్ చేస్తున్నారు పోలీసులు. సో ఇలా చాలా ప్రధానమైన వ్యవస్థల్లో ఇంటర్నెట్ వినియోగం అవసరం ఉంది. కావున డేటా సేవ్ చేయడం కూడా మనందరి బాధ్యత.
Tags : internet, data, streaming, quality, coronavirus, quarantine, lockdown, save