పాలకోవా రెసిపీ

కావాల్సిన పదార్థాలు: మీగడ తీయని పాలు – ఒకటిన్నర లీటరు పంచదార – నాలుగు టేబుల్‌ స్పూన్లు నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు కుంకుమ పువ్వు – తగినంత, యాలకులపొడి – చిటికెడు తయారీ చేసే విధానం: ఒక మందపాటి గిన్నె తీసుకొని పాలు పోసి సన్నని మంటపై మరిగించుకోవాలి. పాలు మరుగుతున్న సమయంలో మధ్యమధ్యలో కలుపుకోవాలి. పాలు మరుగుతుండగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. పాలు చిక్కబడుతున్న సమయంలో రంగు మారుతోంది. పాలు కాస్త చిక్కబడిన […]

Update: 2020-11-05 23:51 GMT

కావాల్సిన పదార్థాలు:

మీగడ తీయని పాలు – ఒకటిన్నర లీటరు
పంచదార – నాలుగు టేబుల్‌ స్పూన్లు
నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు
కుంకుమ పువ్వు – తగినంత,
యాలకులపొడి – చిటికెడు

తయారీ చేసే విధానం:

ఒక మందపాటి గిన్నె తీసుకొని పాలు పోసి సన్నని మంటపై మరిగించుకోవాలి. పాలు మరుగుతున్న సమయంలో మధ్యమధ్యలో కలుపుకోవాలి. పాలు మరుగుతుండగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. పాలు చిక్కబడుతున్న సమయంలో రంగు మారుతోంది. పాలు కాస్త చిక్కబడిన తరువాత అందులో యాలకుల పొడి, పంచదార, నెయ్యి వేసి కలుపుకోవాలి. చక్కెర వేసిన తర్వాత ఈ మిశ్రమం పలుచబడుతుంది. చిక్కటి మిశ్రమంగా మారే వరకు చిన్న మంటపై మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆపేసి వేరే గిన్నెలోకి మార్చుకుని సర్వ్‌ చేసుకుంటే పాలకోవా రెడీ.

Tags:    

Similar News