LRS తప్పనిసరిగా కట్టాల్సిందేనా.. ఇంటి ‘రుణం’ పొందేదెలా.?

దిశ, వెబ్‌డెస్క్ : సొంతిల్లు కొనుక్కుంటే 80 శాతం వరకూ బ్యాంకులు హోమ్‌లోన్ ఇస్తాయనే నమ్మకంతో చాలా మంది బిల్డర్లకు ముందే అడ్వాన్సులు ఇచ్చేస్తూ, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకుంటుంటారు. ఆ తరువాత లోన్ కోసం బ్యాంకులలో ప్రయత్నాలు మొదలుపెడతారు. సమస్య ఇక్కడే వస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరగవు. కొందరి హోమ్‌లోన్ దరఖాస్తులను  బ్యాంకులు తిరస్కరిస్తాయి. దీంతో దరఖాస్తుదారు ఇటు రుణం రాక, అటు బిల్డర్ దగ్గర అడ్వాన్స్ డబ్బులు తిరిగి వసూలు చేసుకోలేక దిక్కుతోచని స్థితిలో […]

Update: 2021-08-04 01:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సొంతిల్లు కొనుక్కుంటే 80 శాతం వరకూ బ్యాంకులు హోమ్‌లోన్ ఇస్తాయనే నమ్మకంతో చాలా మంది బిల్డర్లకు ముందే అడ్వాన్సులు ఇచ్చేస్తూ, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకుంటుంటారు. ఆ తరువాత లోన్ కోసం బ్యాంకులలో ప్రయత్నాలు మొదలుపెడతారు. సమస్య ఇక్కడే వస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరగవు. కొందరి హోమ్‌లోన్ దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరిస్తాయి. దీంతో దరఖాస్తుదారు ఇటు రుణం రాక, అటు బిల్డర్ దగ్గర అడ్వాన్స్ డబ్బులు తిరిగి వసూలు చేసుకోలేక దిక్కుతోచని స్థితిలో పడిపోతాడు. జీవితంలో పెళ్లి తరువాత అతి ముఖ్యమైంది సొంతిళ్లు. దానికోసం చాలామంది హోమ్‌లోన్ తీసుకోవడానికే మెుగ్గుచూపుతారు. కొన్నిసార్లు బ్యాంకులు మన అప్లికేషన్‌ను ఆమోదించకపోవచ్చు. దీనికి దరఖాస్తు చేయడంలోని తప్పులే కాదు, ఇతర కారణాలూ ఉంటాయి.

ఈ పత్రాలు ఉండాల్సిందే..

బ్యాంకులు, ఎన్‌ఎఫ్‌సీలు ముఖ్యంగా మూడు విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. మెుదటిది ప్రాపర్టీ క్లియరెన్స్. రెండోది క్రెడిట్ స్కోర్, మూడు రీ పేమెంట్ కెపాసిటీ. మనం కొంటున్న ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ ఉందా? లేదా? అనేది మొదటి పాయింట్. పట్టా, నోటరీ, గ్రామ కంఠంలాంటి ఆస్తులను కొనుగోలు చేయడానికి, అందులో ఇల్లు నిర్మించడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వవు. మున్సిపల్ కార్యాలయాల నుంచి అనుమతులు లేకుంటే కూడా హోమ్‌లోన్స్ ఇవ్వరు.

ప్రాపర్టీ రిజస్ట్రేషన్ ఎప్పుడైంది? ఎవరెవరి చేతులు మారింది? ఇలాంటి ఎన్నో అంశాలను, లింక్ డాక్యుమెంట్లను పరిశీలించి, లీగల్ ఒపీనియన్ తీసుకున్నాకే రుణం ఇవ్వడంపై బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి. అందుకే హోమ్‌లోన్‌కు వెళ్లేవారు తొందరపడి బిల్డర్లకు అడ్వాన్సులు ఇచ్చేయకుండా ముందుగా వారి నుంచి ప్రాపర్టీ పేపర్స్ తీసుకుని బ్యాంకర్లకు చూపించండి. ప్రాపర్టీకి రుణం ఇవ్వడానికి న్యాయపర ఇబ్బందులేమీ లేవని బ్యాంకులు చెబితేనే అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోడానికి ముందుకు వెళ్ళండి.

సిబిల్ స్కోర్ ఇలా..

లోన్ కావాలనుకునేవారికి 750 వరకూ సిబిల్ స్కోర్ ఉండేలా చూసుకోవాలని రిజర్వ్ బ్యాంకు బ్యాంకులను హెచ్చరిస్తూ ఉంటుంది. ప్రధాన బ్యాంకులలో కనీస స్కోర్ 650 ఉన్నా ఫైల్ ముందుకు వెళ్తుంది. బ్యాంకులు సిబిల్ స్కోర్ ఒక్కదానినే పరిగణనలోకి తీసుకోవు. ఇంతకుముందు తీసుకున్న అప్పులు సరైన సమయంలోనే చెల్లించాడా? ఏమైనా ఎగ్గొట్టాడా? అనేదీ చూస్తాయి. సిబిల్ 800 వరకూ ఉన్నా, అప్పటివరకూ తీసుకున్న అప్పుల క్రెడిట్ రిపోర్ట్ సంతృప్తికరంగా లేకపోతే అప్లికేషన్‌ తిరస్కరిస్తారు.

ఏ బ్యాంకైనా కేవలం ప్రాపర్టీ విలువను దృష్టిలో పెట్టుకుని రుణం ఇవ్వదు. తాము ఇస్తున్న రుణం అసలు, వడ్డీ కలిపి తిరిగి రాబట్టుకోవడమే వారికి కావలసినది. దరఖాస్తుదారుకు స్థిరమైన ఆదాయం ఉందా? లేదా? అని చూస్తాయి. వయసు, నివాసం, ఎంత చదువుకున్నారనేది కూడా పరిశీలిస్తాయి. వయసు, సర్వీసు కాలం, ఈఎంఐ, లోన్స్ తిరిగి చెల్లించే సమయం కూడా లోన్ వస్తుందా లేదా అనేది నిర్ణయిస్తాయి. తక్కువ వయసు ఉండి, లోన్ చెల్లించేందుకు ఎక్కువ టైమ్ ఉంటే, తక్కువ ఈఎంఐతో లోన్ తీర్చేందుకు ఛాన్స్ ఉంటుంది.

కావున తొందరగా ఆమోదించే అవకాశం ఉంది. అదే వయసు ఎక్కువగా ఉండి, పదవీ విరమణకు దగ్గరగా ఉంటే లోన్ పూర్తి చేసేందుకు తక్కువ టైం ఉంటుంది. ఈఎంఐ కూడా పెరుగుతుందనేది గుర్తుపెట్టుకోవాలి. సాధార‌ణంగా నెల‌ ఆదాయంలో 50-60 శాతం లోప‌లే ఈఎంఐ ఉండేలా బ్యాంకులు జాగ్రత్త పడతాయి. అంత‌కు మించి ఈఎంఐ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే లోన్ అప్లికేషన్ తిరస్కరించే అవకాశం ఉంటుంది.

రుణం ఎంత పొందొచ్చు..

ప్రాపర్టీ మార్కెట్ విలువలో 85 శాతం వరకూ బ్యాంకులు రుణాలిస్తాయి. ప్రభుత్వ రేట్ కార్డు ధరతో సంబంధం లేదు. భవనం నిర్మించి ఎన్నేళ్లు అవుతుంది, ఇల్లు ఉన్న ప్రదేశం, నిర్మాణ విలువలు, ప్రస్తుతం ఉన్న స్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆస్తి విలువ అంచనా వేస్తారు. ఒకవేళ మీ ఆస్తి విలువ తక్కువగా ఉండి.. మీకు లోన్ అర్హత ఎక్కువ ఉన్నా.. అనుకున్న మొత్తం రుణం రాకపోవచ్చు లేదా దరఖాస్తు తిరస్కరించవచ్చు.

ఇల్లు, విల్లా లేదా అపార్టుమెంట్ ఫ్లాట్ కొనుగోలు చేసేముందు అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని ముందే నిర్దారించుకోండి. ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేయాలన్నా బ్యాంకులు రుణం ఇస్తాయి. ఇలాంటి ఆస్తులపై రుణం తీసుకోవాలంటే ప్రాపర్టీకి తప్పనిసరిగా ఎల్ఆర్ఎస్ ఉండాలి. లేకపోతే రుణం రాదు. హైదరాబాద్ వంటి నగరాలలో బ్యాంకు రుణంతో వెంచర్లలో ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేయాలనుకునేవారు రెరాలో రిజిస్టరై హెచ్ఎండీఏ అనుమతి ఉన్న ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News