‘రేపే రోహిణి.. మరి కొనుగోళ్లు ఇంకెన్నాళ్లు’

దిశ, దుబ్బాక : యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రైతు గోస బిజెపి పోరు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నియోజకవర్గంలో రైతుల సమస్యలపై రైతు గోస దీక్ష చేపట్టామని, నెల రోజులుగా కొనుగోలు చేసిన ధాన్యం కేవలం 60% మాత్రమే.. […]

Update: 2021-05-24 04:35 GMT

దిశ, దుబ్బాక : యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రైతు గోస బిజెపి పోరు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నియోజకవర్గంలో రైతుల సమస్యలపై రైతు గోస దీక్ష చేపట్టామని, నెల రోజులుగా కొనుగోలు చేసిన ధాన్యం కేవలం 60% మాత్రమే.. మరి మొత్తం కొనడానికి ఎంత సమయం పడుతుందో తెలపాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో 2, 3కిలోలు తూకం ఎక్కువ తీసుకోవడంపై అధికారులతో పర్యవేక్షణ చేయించాలని, రైతులకు మోసం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులది కాదా అని ప్రశ్నించారు.

కొనుగోళ్లు ప్రారంభమై ఇన్ని రోజులు గడిచిన ఇంకా కొన్ని ఐకెపి సెంటర్లలో సరిపోయేంత బార్ధాన్ రావడం లేదు ఎందుకని, జిల్లాలో జరుగుతున్న ఇసుక వాహనాలు ఆపి.. అవే వాహనాలను ధాన్యం తరలించేందుకు పంపాలని డిమాండ్ చేశారు. వారం పది రోజుల్లో సాధ్యమైనంత ఎక్కువ కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలని సూచించారు. వర్షాలు పడకముందే కొనుగోలు చేసిన ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని, కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులు వేస్తామని ఇంకా వేయకపోవడం బాధాకరమని, రైతులకు కలుగుతున్న ఇబ్బందులు వెంటనే పరిష్కరించాలని బిజెపి తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.

Tags:    

Similar News