ఆ గ్రామంలో వర్షాలకు కూలిపోయిన ఇండ్లు.. రోడ్డున పడ్డ కుటుంబాలు
దిశ, కామారెడ్డి రూరల్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని అడ్లూరులో 6 ఇండ్లు కూలిపోయాయి. అసలే పాత ఇండ్లు కావడంతో వర్షాలకు తడిసి కుప్పకూలాయి. గ్రామానికి చెందిన గొల్ల భూదవ్వ, మోషిన్, గొల్ల ముత్యం, చింతల మల్లేష్, జీల మధు, చింతల రాములుకు చెందిన నివాసపు ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాగా, ఇండ్లు కూలి రోడ్డుపై పడడంతో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా స్థానిక కౌన్సిలర్ గడ్డమీది రాణీ మహేష్ జేసీబీ సహాయంతో మట్టిని తొలగించారు. […]
దిశ, కామారెడ్డి రూరల్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని అడ్లూరులో 6 ఇండ్లు కూలిపోయాయి. అసలే పాత ఇండ్లు కావడంతో వర్షాలకు తడిసి కుప్పకూలాయి. గ్రామానికి చెందిన గొల్ల భూదవ్వ, మోషిన్, గొల్ల ముత్యం, చింతల మల్లేష్, జీల మధు, చింతల రాములుకు చెందిన నివాసపు ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాగా, ఇండ్లు కూలి రోడ్డుపై పడడంతో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా స్థానిక కౌన్సిలర్ గడ్డమీది రాణీ మహేష్ జేసీబీ సహాయంతో మట్టిని తొలగించారు. ఇండ్లు కూలిపోవడంతో రోడ్డున పడ్డ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.