త్వరలో గాంధీ ఆస్పత్రిలో ఓపీ సేవలు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో సాధారణ రోగులకు త్వరలో ఓపీ సేవలు అందుబాలోకి రానున్నట్టు ఆస్పత్రి అధికారులు తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి వచ్చే అవకాశం ఉందని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. కోవిడ్ కోసం మెడికల్ కాలేజ్ లైబ్రరీ బిల్డింగ్‌లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామని, అందులో ఆక్సీజన్ పైప్‌లైన్ ఏర్పాటు పనులు కూడా ప్రారంభం అయ్యాయని వెల్లడించారు. ఆస్పత్రి ప్రధాన గేటు నుంచి సాధారణ రోగులు, పద్మారావునగర్ వైపు ఉన్న పాత గేటు నుంచి […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో సాధారణ రోగులకు త్వరలో ఓపీ సేవలు అందుబాలోకి రానున్నట్టు ఆస్పత్రి అధికారులు తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి వచ్చే అవకాశం ఉందని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. కోవిడ్ కోసం మెడికల్ కాలేజ్ లైబ్రరీ బిల్డింగ్‌లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామని, అందులో ఆక్సీజన్ పైప్‌లైన్ ఏర్పాటు పనులు కూడా ప్రారంభం అయ్యాయని వెల్లడించారు. ఆస్పత్రి ప్రధాన గేటు నుంచి సాధారణ రోగులు, పద్మారావునగర్ వైపు ఉన్న పాత గేటు నుంచి కోవిడ్ బాతులకు ఎంట్రీ ఏర్పాటు చేశారు. కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.