Shani Dev: శని పాలించే గ్రహంలోకి శుక్రుడు.. ఆ రాశుల వారికీ లక్కే లక్కు
2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి. 2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. శనీశ్వరుడు పాలించే రాశిలోకి శుక్రుడు సంచారం చేయనున్నాడు. ఈ ప్రభావం 12 రాశుల వారిపైన చూపనుంది. దీనివల్ల ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారు అనేక ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
మిథున రాశి
శుక్రుడు, శని కలయిక వలన మిథున రాశి వారికి మంచిగా ఉండనుంది. ఈ రాశి వారి జీవితం అద్భుతంగా ఉండనుంది. ముఖ్యంగా, కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టె వారికీ అధిక లాభాలు వస్తాయి. అలాగే, పెట్టుబడులు పెట్టె వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అంతేకాకుండా, ఈ రాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వీటితో పాటు మొదలు పెట్టిన ప్రతీ పనిలో అద్భుతమైన విజయాలు పొందుతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.