Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 18-12-2024)

ఈ రోజు రాశి ఫలాలు ( 18-12-2024)

Update: 2024-12-17 21:30 GMT

మేష రాశి : ఫైనాన్స్ మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. డబ్బు విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తవచ్చు. మీరు ఈ రోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. దాని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది.

వృషభ రాశి: ఈ రాశికి చెందినవారు విదేశాలలో మీ వ్యాపారాన్ని చేయాలనుకుంటే.. అది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులు, స్నేహితుల నుండి అనుకోని బహుమతులు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో వాళ్లకి చెప్పి చేయండి.

మిథున రాశి: మీరు ఆనందించే విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు పనిచేసే ఆఫీసులో ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరుగును. ఈ రాశి వారు ఉన్నతాధికారుల నుంచి సపోర్ట్ దొరుకుతుంది. మీరు మొదలు పెట్టిన ప్రతీ పనిలో మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది.

కర్కాటక రాశి: సంతృప్తికరమైన జీవితం కోసం మీ మానసిక శక్తిని పెంపొందించుకోండి. దీంతో పాటు ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా, కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది.

సింహ రాశి : ఈ రోజు.. ఈ రాశికి చెందిన కొందరు విద్యార్థులు టీవీ, కంప్యూటర్లు చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ అంచనాలను మించి ఈరోజు మిమ్మల్ని సంతోషపరుస్తాయి.

కన్యా రాశి: ఆరోగ్య సమస్యల విషయంలో మీ స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ అవాస్తవ, ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలు డబ్బు కొరతకు దారితీయవు. మీ కఠినమైన ప్రవర్తన మీ పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి, లేకపోతే మీ మధ్య అడ్డంకి ఏర్పడుతుంది.

తులా రాశి: ఈ రోజు మీరు వెతుకుతున్న మీ కలల రాణి కనిపిస్తుంది. చూసిన మొదటి సారిలోనే ప్రేమలో పడతారు. మీకు ఇష్టమైన సామాజిక సేవల్లో పాల్గొనడానికి సమయాన్ని వెచ్చించండి. మీ చుట్టుపక్కల వారి ప్రవర్తన కారణంగా మీకు చాల కోపం వస్తుంది. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. దీంతో భవిష్యత్తులో మీకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్ని పూర్తి చేస్తారు. మీ ప్రియమైన వారు మీ మీద అలుగుతారు.. కొంచం ఓపిక తెచ్చుకుని వారిని బుజ్జగించండి.

మకర రాశి: ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. గ్రహాన్ని బట్టి ఎవరైనా మీకు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుని పెట్టండి.. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది.

కుంభ రాశి: కుంభ రాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికీ మంచి జాబ్ వస్తుంది. వ్యాపారాలు చేసే పెట్టె వారికీ ఇది మంచి సమయం. పెట్టుబడులు పెట్టె వారికీ లాభాలు వస్తాయి. అలాగే, పెండింగ్ పనులును పూర్తి చేస్తారు. దీంతో పాటు, ఈ సమయంలో ఎలాంటి పనులు మొదలు పెట్టిన సులభంగా విజయాలు సాధిస్తారు. 

మీన రాశి: ఈ రోజు ఖర్చులు బాగా పెరుగుతాయి. దీని వలన మీరు చిరాకు పడుతుంటారు. అంతక ముందు దాచిన డబ్బు ఈ రోజు ఉపయోగపడుతుంది. మీ నిర్లక్ష్యం వల్ల వ్యాపారాల్లో నష్టాలు చూస్తారు. వ్యక్తిగత స్థాయిలో, మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు సమస్యలను సృష్టించవచ్చు.

Tags:    

Similar News