Shani Dev: శని ప్రభావంతో ఆ రెండు రాశుల వారికీ లాటరీ తగిలినట్లే..!

గ్రహాలలో శని దేవుడు నెమ్మదిగా కదులుతుంటాడు.

Update: 2024-12-31 07:10 GMT

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ( Astrology) ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి. 2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. అంతేకాకుండా, దీని ప్రభావం 12 రాశుల వారిపైన చూపనుంది. గ్రహాలలో శని దేవుడు నెమ్మదిగా కదులుతుంటాడు. మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి రెండున్నర ఏళ్ళు సమయం పడుతుంది. అయితే, 2025 లో మీన రాశిలోకి శని ప్రవేశించబోతున్నాడు.

వృషభ రాశి

వృషభ రాశి వారు 2025 లో శని ప్రభావంతో చేయలేమని అనుకున్న పనుల్లో కూడా విజయం సాధిస్తారు. అంతే కాకుండా, ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. మీరు పనిచేసే ఆఫీసులో జీతం పెరుగుతుంది. పాత భూములకు రేట్లు విపరీతంగా పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతుంది.

కన్యారాశి

కన్యారాశి వారికీ శని దేవుడు శుభ యోగాలను ఇవ్వబోతున్నాడు. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మీరు మొదలు పెట్టిన కొత్త పనుల్లో మీ జీవిత భాగస్వామి మద్ధతు ఉంటుంది. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగ ఉంటుంది. వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభం ఉంటుంది. 2025 నుంచి మొదలుకుని 2027 వరకు అదృష్ట యోగం ఉంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News