Today's Horoscope: నేటి రాశి ఫలాలు (7-29-2024)

ఈ రోజు రాశి ఫలాలు

Update: 2024-07-28 23:30 GMT

మేష రాశి: ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. అలాగే ఈ రోజు ధనలాభం పొందుతారు. మీ సామర్థ్యం రివార్డులు పొందేలా చేస్తుంది. అలాగే మీ భాగస్వామిపై అనవసరమైన సందేహాలు అనుమానాలు పెట్టుకోవడం వల్ల బంధాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి అలాంటివేమీ పెట్టుకోకండి. షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది.

వృషభ రాశి: ఈ రోజు బయటకు వెళ్లే ముందు పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. అలా చేయడం వల్ల అనుకున్న పని పూర్తి అవుతుంది. మీ భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి సలహాలు ఇచ్చేవారితోనే కలిసి ఉండండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారు.

మిథున రాశి: ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. ఓర్పుగా ఉండకపోతే ఇతరులతో గొడవ ఏర్పడుతుంది. దీంతో కోపంలో మీరు వారిని అనే మాటలు బాధపెడతాయి. మీ ప్రియమైన వ్యక్తి, మీ సంతోషంగా ఉండడం కోసం కొన్ని ముఖ్యమైన పనులు చేస్తారు. మధురమైన రొమాంటిక్ అనుభూతులను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు.

కర్కాటక రాశి: ఈరోజు కొంత ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. కాబట్టి ఏదైనా కొనాలనుకునే ముందు ఆలోచించి కొనండి. ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలు మీరు గనక ఈ రోజు పట్టించుకోలేదంటే తను బాధపడుతుంది. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవాలని అనుకుంటారు. కానీ మీ కుటుంబ సభ్యులు చెడగొడతారు.

సింహ రాశి: ఈ రోజు మీరు కచ్చితంగా చేయగలము అనుకుంటేనే ఎవరికైనా మాట ఇవ్వండి. లేదంటే ఇతరులు మీ వల్ల బాధపడతారు. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసి డబ్బు వృధా చేస్తారు. దీని వల్ల మానసికంగా కృంగిపోతారు.

కన్యా రాశి: మీ ప్రవర్తనతో ఇతరుల దగ్గర మెప్పు పొందుతారు. ఈ రోజు మీరు ముఖ్యమైన పనులు పూర్తి చేసి సమయాన్ని అనుకున్నట్టుగా ఉపయోగించుకుంటారు. మీరు కొద్దిగా సమయాన్ని, శక్తిని పెట్టి జ్ఞానాన్ని నైపుణ్యాలను అదనంగా పొందగలిగితే, అద్భుతమైన లబ్ది పొందగలరు. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్యలో ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చి పెడతారు.

తులా రాశి: మీరు ప్రేమించిన వ్యక్తి మీపై ద్వేషాన్ని పెంచుకుంటారు. కాబట్టి బంధాన్ని దూరం చేసుకోకూడదంటే.. అగౌరవ పర్చడం వంటివి చేయకూడదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈరోజు నష్టాలు చవి చూడక తప్పదు. కాబట్టి ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే.. కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ పనులను పూర్తి చేయని కారణంతో ఆఫీసులో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. కొత్త ఉద్యోగంలో చేరడానికి ఇంటర్వ్యూకి వెళ్లాలనుకుంటే ఇదే మంచి రోజు.

వృశ్చిక రాశి: అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కోలుకునే అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. మీరు నేడు ఏ పోటీల్లో పాల్గొన్నా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది.

ధనుస్సు రాశి: డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్న మీకు నేడు కలిసివస్తుంది. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. అలాగే భాగస్వామిని బయటకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తారు. కానీ తన అనారోగ్య దెబ్బతినడం వల్ల ఆగిపోతారు. ఈ రోజు మీరు ఎంతో ఆనందంగా గడుపుతారు.

మకర రాశి: విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటారు. కానీ ఆర్థిక పరిస్థితులు నిరాశకు, బాధను కలిగిస్తాయి. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలు అందుకుంటారు. తప్పుడు సమాచారంతో మీరు ప్రేమించే వారితో గొడవ పడే అవకాశం ఉంది. కూర్చుని మాట్లాడుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చును.

కుంభ రాశి: ఏదైనా అతిగా తినకుండా ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. ఆర్థిక సమస్యలు మెరుగుపడటంతో పాటు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరులతో గొడవలు అంత మంచివి కావు. కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి. పనిచేసే చోట మీ తెలివితేటలు ఉపయోగించడం వల్ల ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. ఈరోజు విద్యార్థులు, వారి పనులను రేపటికి వాయిదా వేసుకోకుండా ఈరోజు వాటిని పూర్తి చేయాలి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడప లేనంతగా బిజీగా ఉంటారు.

మీన రాశి: నేడు ఇతరుల సలహాలు సూచనలు పాటించి పెట్టుబడులు పెట్టారంటే.. ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం. మీకు పనిలో మీ సామర్థ్యం ఉపయోగించడం వల్ల గుర్తింపు వస్తాయి. అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందీ.

Tags:    

Similar News