మేష రాశి: ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెటర్. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి అంగీకారం ఉండేలా చూసుకోండి.
వృషభ రాశి : ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో గొడవకు దిగుతారు. ఈరోజు ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని వృధా చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్ ను బాగా దెబ్బ తీయవచ్చు.
మిథున రాశి: మీకు మానసిక అనారోగ్యం కలిగించే వ్యతిరేకమైన ఆలోచనలు మానుకోవాలి. దానధర్మాలు, సంఘ సేవలు చేస్తే, మనశ్శాంతి కలుగుతుంది. ఇంటికి సంబంధించిన ఖరీదైన వస్తువులు కొనటం వలన మీరు ఈరోజు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. మీ భాగస్వామితో కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం.
కర్కాటక రాశి: బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్ఠను నాశనం చేస్తాయి. మీ భాగస్వామి ప్రేమను ఈ రోజు ఎప్పుడూ లేని అనుభూతి చెందుతారు.
సింహ రాశి: క్రొత్త ఆలోచనలు చేస్తున్నట్లు అయితే మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును ఖర్చు చెయ్యడం. ఇతరులను పరిశీలించడం ద్వారా మీరు కొన్ని గుణపాఠాలను నేర్చుకోవచ్చును. మీ జీవిత భాగస్వామి ఈ రోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు. మీకు ఓ చక్కని సర్ ప్రైజ్ ఇస్తారు.
కన్యా రాశి: ఈరోజు బయటకి వెళ్లేముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. దీనివల్ల పోయిన పని విజయవంతంగా పూర్తి అవుతుంది. మీ ప్రియమైనవారు మిమ్ములను అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే, వారిని బయటకు తీసుకెళ్లి వాళ్ళతో సమయం గడిపి మీ మనస్సులో ఉన్నది వారికి చెప్పండి. మీ బెటర్ హాఫ్ తో రొమాన్స్ చేసేందుకు ఇది చక్కని రోజు.
తులా రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఇంట్లో పనులు చేయడంలో అలిసిపోతారు.పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి. మీ ఖాళీ సమయంలో ఏదైనా పుస్తకం చదవండి. మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలా చేయడం వలన మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషపడతారు. మీ వైవాహిక జీవితం గొప్పగా ఉండబోతుంది.
వృశ్చిక రాశి: ఈ రోజు సమయం గురించి తెలుసుకుంటారు. అవసరమైన పనుల కోసమే మీ సమయాన్ని కేటాయించండి. పాత కాలంలో దాచిన డబ్బు మీకు ఏదొక రోజు ఉపయోగపడుతుంది. మీకు ఇష్టమైన వాళ్ళ ప్రవర్తన మీకు కోపం వచ్చేలా వస్తుంది కోప పడకుండా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు సాయంత్రం మీకు, మీ జీవిత భాగస్వామికి గొడవ జరిగే అవకాశం ఉంది.
ధనస్సు రాశి: ఈ రోజు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఇన్ని రోజులు ఏమి పోగొట్టుకున్నారో తెలుసుకుంటారు. ఈ రోజు మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోకపోతే దొంగిలించబడవచ్చు. మీ ఇంట్లో వాళ్ల ప్రవర్తన చిరాకు తెప్పించవచ్చు. ఈ రోజు మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుంది.
మకర రాశి: ఈ రోజు ఈ రాశి వారు మొదలు పెట్టిన పనులన్ని పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టె వారు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయండి. ఈ రాశికి చెందిన వివాహితులు తమ ఖాళీ సమయాన్ని టీవీ కానీ టెలిఫోన్ ముందు గడుపుతారు. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
కుంభ రాశి: గర్భవతి మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి. మీ ఖాళీ సమయాన్ని మీ ఇంట్లో వాళ్ళతో గడపండి. దీని వలన వారు సంతోషంగా ఫీల్ అవుతారు. ఏమి తెలియనట్టు అలాగే ఉండకూడదు. మీరు మీ చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉండాలి. సాహసోపేతమైన చర్యలు,నిర్ణయాలు సానుకూల ఫలితాలకు దారితీస్తాయి.
మీన రాశి: మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, టైం ప్రకారం తింటూ ఉండండి. మీ వ్యాపారం నుండి లాభాలను ఎలా పొందాలో మీ పాత స్నేహితుడు మీకు సలహా ఇస్తారు. వారి సలహాను అనుసరించండి. ఈ రోజు సాయంత్రం మీ స్నేహితులతో కలిసి బయటకు వెళ్తారు. మీ జీవిత భాగస్వామికి కోపం తెప్పించే పనులు చేయకండి.