Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 16-09-2024)

ఈ రోజు రాశి ఫలాలు ( 16-09-2024)

Update: 2024-09-15 21:30 GMT

మేష రాశి : ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ఖాళీ సమయంలో కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతారు. ఇది మీ చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. మీ ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాతో గడుపుతారు. మీ వైవాహిక జీవితం అందంగా మారుతుంది.

వృషభ రాశి: ఈ రోజు ఉదయం కొంచం మీకు అశాంతి కలిగించవచ్చును. మీ పాత స్నేహితులను కలుసుకుని మీ బాధలు షేర్ చేసుకుంటారు. టెన్షన్ ను పక్కన పెట్టి మీతో మీరు కొంత సమయం గడపండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి చెప్పిన పనిని చేయండి.

మిథున రాశి: సంతృప్తికరమైన జీవితం కోసం మీ మానసిక శక్తిని పెంపొందించుకోండి. ఈ రోజు ఉదయం కొంచం మీకు అశాంతి కలిగించవచ్చును. మీ పాత స్నేహితులను కలుసుకుని మీ బాధలు షేర్ చేసుకుంటారు. టెన్షన్ ను పక్కన పెట్టి మీతో మీరు కొంత సమయం గడపండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి చెప్పిన పనిని చేయండి.

కర్కాటక రాశి: ఈ రోజు మీరు వెతుకుతున్న మీ కలల రాణి కనిపిస్తుంది. చూసిన మొదటి సారిలోనే ప్రేమలో పడతారు. మీకు ఇష్టమైన సామాజిక సేవల్లో పాల్గొనడానికి సమయాన్ని వెచ్చించండి. మీ చుట్టుపక్కల వారి ప్రవర్తన కారణంగా మీకు చాల కోపం వస్తుంది. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

సింహ రాశి : ఈ రాశికి చెందినవారు విదేశాలలో మీ వ్యాపారాన్ని చేయాలనుకుంటే.. అది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులు, స్నేహితుల నుండి అనుకోని బహుమతులు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో వాళ్లకి చెప్పి చేయండి.

కన్యా రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. ఈ రోజు అప్పు కోసం మీ వద్దకు మీ స్నేహితుడు వస్తాడు. కానీ, అడిగిన వెంటనే సహాయం చేయకండి. దాని వలన మీరు తరువాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు.

తులా రాశి: ఈ రోజు మీకు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది. మీరు ఆడతారు లేదా వ్యాయామం చేయడానికి వెళతారు. ఈ రోజు మీ యజమాని మీ పనికి మిమ్మల్ని ప్రశంసించవచ్చు. మీ శరీరాన్ని ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచడానికి మంచి ఆహారాలను తీసుకోండి.

వృశ్చిక రాశి: బయట ఫుడ్స్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల విషయంలో మీ స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు మీరు ఆఫీసుల్లో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు గందరగోళాన్ని ఎదుర్కొంటారు. ఇది మీకు పని చేయడంలో సహాయం చేయదు.

ధనస్సు రాశి : ఈ రోజు బయటకు వెళ్ళేటపుడు జాగ్రత్తగా ఉండండి. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు రావడంతో మీరు చేయాలనుకున్న పనులు పెండింగ్ పడతాయి. మీ ఖాళీ సమయాన్ని మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలతో గడుపుతారు. ఎవర్ని గుడ్డిగా నమ్మకండి.. దీని వలన మీరు నష్టపోయే అవకాశం ఉంది.

మకర రాశి: ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. ఈ రోజు కార్యాలయంలోని ప్రతిదీ మీకు ప్రయోజనం చేకూరుస్తుంది, వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమైనదో మీరు అర్థం చేసుకుంటారు, ఈ రోజు మీకు చాలా ఖాళీ సమయం ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

కుంభ రాశి: ఈ రోజు డబ్బు విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీ ఆర్థిక సమస్యలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులన్ని పూర్తి చేస్తారు. ఈ రోజు మీ ప్రియమైన వారు మీ మీద అలుగుతారు.. వారిని అలాగే వదలకండి. కొంచం ఓపిక తెచ్చుకుని వారిని బుజ్జగించండి.


Similar News