మేష రాశి: మీకు అలసిపోయినట్లుగా అనిపిస్తే.. కొద్ది సమయం పిల్లలతో సమయం గడపడం వారిని కౌగిలించుకోవడం వంటివి చేయడం చేస్తే అలసట తగ్గడంతో పాటుగా అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటారు. అయితే ఇంతకు ముందు డబ్బులు ఎక్కువగా ఖర్చుపెట్టినట్లు అయితే అది ఇప్పుడు మీకు ఆర్ధిక సమస్యలకు కారణం అవుతుంది. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ ప్రైజ్ ను అందుకోవచ్చు.
వృషభ రాశి: ఈరోజు ఒకదాన్ని మించి మరొక దాని నుండి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటాయి. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితులనుండి అందుతాయి. మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చూపించి కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. అలాగే మీరు మీ అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎన్నడూ లేని విధంగా సరికొత్త విధంగా రెడీ అవ్వడానికి సమయాన్ని కేటాయిస్తారు.
మిథున రాశి: కొన్ని సమస్యల వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మీ స్నేహితుడు మిమ్ములను పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతాడు. అలా అని మీరు ఆలోచించకుండా ఇచ్చారో ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యక్తిగతానికి సంబంధించిన విషయాలు ఇతరులతో పంచుకోకుండా ఉండాలి.
కర్కాటక రాశి: మీ స్నేహితులు కొన్ని విషయాల్లో సపోర్ట్ చేయడంతో పాటు మీకు సంతోషం కలిగేలా చేస్తారు. ఈ రోజు కొంత ధనాన్ని సంపాదించుతారు. అంతేకాకుండా మీరు అప్పుగా ఇచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేస్తారు. లేదా ఇతరులను క్రొత్త ప్రాజెక్ట్‌ల కోసం నిధుల కోసం అడుగుతారు. అవసరం లేని పనులు మళ్లీ మళ్లీ చేసి సమయాన్ని వృధా చేస్తారు.
సింహ రాశి: మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడుపోయి లాభాలను చేకూరుస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితులు అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటారు. అందువల్ల కాస్త ఇబ్బందులు కలిగే చాన్స్ ఉంది. ఈ రోజు మీ బంధువు, మిత్రుడు, లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చి పెడతారు.
కన్య రాశి: ఈ రోజు ధనాన్ని పొదుపు చేస్తారు. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. ప్రేమ వ్యవహారంలో అపార్థాలు వచ్చి కాస్త బాధను కలిగించే అవకాశం ఉంది. ఖాళి సమయములో ఈరోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్సిరీస్‌ను చూస్తారు. మీ బెటర్ హాఫ్ ను తరచూ సర్ ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాధపడుతుంది. అందువల్ల మీ వైవాహిక జీవితంలో కూడా కలతలు వచ్చే అవకాశం కూడా ఉంది.
తులా రాశి: చిన్నతరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి సన్నిహితుల సలహాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తాయి. మీరు కుటుంబ బాధ్యతలు అశ్రద్ధ చేయడం వల్ల వారి కోపానికి గురికావొచ్చు. కాబట్టి కొంత సమయాన్ని కుటుంబ సభ్యులకు కేటాయించాలి. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే, ఇతరులు చెప్పిన సలహాలు వినండి. అలాగే మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి.
వృశ్చిక రాశి: మీ పెద్దల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకునేటప్పుడు మీరు కోపంగా విచక్షణ కోల్పోయి మాట్లాడకుండా మౌనంగా ఉండటం మంచిది. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే, మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి సమయం కేటాయిస్తారు.
ధనుస్సు రాశి: మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వల్ల ప్రయోజనకరమైన రోజుగా మారుతుంది. గత కొద్ది కాలంగా వసూలు కానీ బాకీలు ఈ రోజు ఇవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈరోజు మీ పనులకు విరామం ఇచ్చి జీవిత భాగస్వామితో మధురమైన సమయాన్ని గడుపుతారు. అయితే అవసరమైన సమయంలో మీ స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందించరు అని భావిస్తారు. కానీ వారు ఎంతో కొంత సహాయం చేస్తారు.
మకర రాశి: మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి కోసం పలు విషయాలు మాట్లాడుకుంటారు. సాయంత్రం మీ ఇంటికి అతిథులు రావడం వల్ల అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాలు సృష్టించే శక్తి ఉంది. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయడం వల్ల మరపురానిదిగా మిగిలిపోవచ్చు. అలాగే ఈ రోజు మీ ప్రియమైన వారితో కలిసి సినిమా చూడటం వల్ల ఆనందాన్ని,ఉత్సాహాన్ని కలిగిస్తాయి.
కుంభ రాశి: మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకొండి. లేదంటే మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులు ఈ రోజు పూర్తి అవుతాయి. వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ప్రేమను పొందే అవకాశం ఉంది. మీకు ఆధ్యాత్మికతతో కూడుకుని ఉంటుంది. దేవస్థానాలు దర్శించడం, దానధర్మాలు, ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు.
మీన రాశి: శరీరానికి నూనె మర్దన చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. అయితే ఈ రోజు ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ ఇంటి వద్ద మీరు ఎవరినీ హర్ట్ చేసే ప్రయత్నం చేయవద్దు. మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు. కానీ మత్తుపానీయాలకు కాస్త దూరంగా ఉండండి. ఇది వృధా సమయం లాంటిది. ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో సమయం గడుపుతారు. కానీ తన ఆరోగ్యమే పాడు కావడం వల్ల కాస్త బాధకు గురవుతారు.