Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ఇవే! (17-8-2024)

ఈ రోజు రాశిఫలాలు ఇవే

Update: 2024-08-16 23:30 GMT

మేష రాశి: మీ పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేనందువలన, బడిలో మాట పడి కాస్త నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయం పనుల వల్ల మీరు రోజూ చేసే పనులకు కాస్త ఆటంకం కలుగుతుంది. మానసిక ప్రశాంతత చాలా ముఖ్యము కాబట్టి ఈ రోజు పార్కుకు, నది ఒడ్డుకు, గుడికి వెళ్లి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

వృషభ రాశి: వయసు మీరిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యల నుంచి మీ తల్లిదండ్రుల సహాయంతో బయటపడతారు. అలాగే అనవసరంగా డబ్బులు వృధా చేయడం వల్ల మీ జీవిత భాగస్వామిని బాధపెట్టిన వారు అవుతారు. దీంతో ఇంట్లో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది.

మిథున రాశి: మీ బిడ్డ లేదా మీ ఇంట్లో ఉండే పెద్దల ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవతంపై ప్రభావం పడే చాన్స్ ఉంది. అయితే పెద్దవారి నుండి సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల రోజు వారి జీవితంలో ఉపయోగపడతాయి. మీ జీవిత భాగస్వామితో చిన్న విషయానికి గొడవలు అవుతాయి. ఈరోజు మీకు చాలా సమయం దొరకడం వల్ల ఆడుకోడానికి లేక జిమ్‌కు వినియోగించుకుంటారు. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు తెలుస్తుంది. ప్రేమ కంటే గొప్పదైన భావము ఇంకోటి లేదు. కాబట్టి ప్రేమను మీ భాగస్వామితో అర్థం అయ్యేలా చెప్పడం మంచిది.

కర్కాటక రాశి: పనిచేసే చోట సీనియర్ల వల్ల ఒత్తిడి గురవుతారు. అలాగే ఇంట్లో మీరు ఏ విషయాన్ని పట్టించుకోవడం లేదని మీ భాగస్వామి మీతో వాగ్వాదం చేసే అవకాశం ఉంది. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి, పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చు. ఆర్థిక లావాదేవీలపై జాగ్రత్త వహించడం వల్ల నష్టాల నుంచి బయటపడతారు. అలాగే ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడపటానికి మీకు సమయం దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలనూ ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం.

సింహ రాశి: ఇంటి పనుల కోసం మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. దీని వల్ల ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకుని ఉంటుంది. అంటే దేవస్థానాలు దర్శించడం,దానధర్మాలు చేయటము,ధ్యానం చేయడం వంటివి చేస్తారు.

కన్యా రాశి: ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కానీ వాటిని మీరు ఉపయోగించుకోకుండా దానధర్మాలకు వినియోగిస్తారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం వల్ల పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచనలో పడతారు.

తులా రాశి: ఈరోజు బయటకి వెళ్లేముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శుభాలు జరిగే అవకాశం ఉంది. ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం మిమ్మల్ని కలిస్తే వాటిని వినకండి. అవి మిమ్మల్ని చీకాకు గురి చేస్తాయి. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే, ఇతరులు చెప్పిన సలహాలు వినండి. మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యుల కంటే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.

వృశ్చిక రాశి: ఈ రోజు డబ్బు పొదుపు చేయాలనే ఆలోచనను పాటించి కొంత ధనాన్ని కూడబెడతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయములో మీకు నచ్చినట్టు ఉంటారు.

ధనుస్సు రాశి: ఈరోజు మీతో బుట్టువులు మిమ్ములను ఆర్ధికసహాయము అడుగుతారు. మీరు జాలిపడి వారికి సహాయము చేస్తే అది మీకు మరింత ఆర్ధిక సమస్యలకు దారితీయవచ్చు. మీ దగ్గరి వారితో గత కొద్ది కాలంగా కొనసాగుతున్న తగాదాలను ఈ రోజే మాట్లాడుకుని పరిష్కరించుకోవడం బెటర్. అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు అయ్యే చాన్స్ ఉంది. అంతేకాకుండా మీకు బాగా దగ్గరవారి వలన నిరాశకు గురవుతారు.

మకర రాశి: మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఉత్తమమైన రోజు ఇదే. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు పూర్తిచేయని పనులను ఈరోజు ఆపని కొరకు వినియోగించాల్సి ఉంటుంది. మీ భాగస్వామి ఈ రోజు మీరు తన జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పి మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తుంది. కొంతమందితో ఇతరులతో మనసు విప్పి మాట్లాడటం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు.

కుంభ రాశి: మీకున్న చెడు అలవాట్ల వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం పడి పలు సమస్యలు ఎదురవుతాయి. ప్రమాదకరమైన కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం, ఆందోళనలకు కారణం కావచ్చు. ఖాళీసమయములో మీకునచ్చినట్టుగా ఉంటారు. మీ జీవిత సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకో అద్భుతమైన సర్ ప్రైజ్ ఇవ్వవచ్చు.

మీన రాశి : ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమలో కొన్ని సమస్యలు రావడం వల్ల కొంత బాధను అనుభవించవచ్చు. మీరు సన్నిహితంగా ఉండే వారితో కాస్త అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొన్ని విషయాల వల్ల ఇది ఒక టెన్షన్ నిండిన రోజుగా మారనుంది. మీరు మీ జీవిత భాగస్వామి మీపై కొంత నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. కానీ రోజు పూర్తయే లోపు మీరు అసలు విషయాన్ని గ్రహించి తనను అర్థం చేసుకుంటారు. మీరు ఈరోజు ఇంట్లోనే ఉంటారు. అయితే కుటుంబ కలహాలు మిమ్ములను విచారానికి గురి చేస్తాయి.

Tags:    

Similar News