Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు

ఈ రాశి వారు ఎవరైతే చాలాకాలంగా ఆర్థిక సమస్యలను ఎదురుకుంటున్నారో వారికి ధనం అందుతుంది.

Update: 2024-08-02 23:45 GMT

మేష రాశి : ఈ రాశి వారు ఎవరైతే చాలాకాలంగా ఆర్థిక సమస్యలను ఎదురుకుంటున్నారో వారికి ధనం అందుతుంది. అలాగే మీ యొక్క సమస్యలన్నీ పరిష్కరించబడుతుంది. ఇంట్లో ఏవైనా మార్పులు చేసేముందు, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకొండి. లేకుంటే అది తరువాత కోపాలను, విచారాలను తేవచ్చు. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు.

వృషభ రాశి : ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, మీ బడ్జెట్‌కి కట్టుబడి ఉండంటం చాలా ముఖ్యం. ఈరోజు మీరు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాలకు మించి, లబ్దిని చేకూరుస్తాయి.

మిథున రాశి : మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. ఆరోగ్యం బాగు లేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండీ. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్‌లో అతుక్కుపోతారు. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసి రానుంది.

కర్కాటక రాశి : ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే, ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడం ఆనంద దాయకం. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి, మీ యొక్క అవకతవకలకు ప్రవర్తనతో విసిగిపోతారు.

సింహ రాశి : ఈరోజు మీకు దగ్గరివారు మీకు మరింత దగ్గరవుదామని చూస్తారు. కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపే మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు. మీరు, మీ జీవిత భాగస్వామి ప్రేమలో, శారీరక బంధం మధురిమలో మునిగి తేలేందుకు ఎంతో సమయం వెచ్చిస్తారు. అలాగే ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను, గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు,సూచనలు విద్యార్థులకు సబ్జెక్టుని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి.

కన్యా రాశి : ఈరోజు మిమ్ములను మీరు అనవసర, అధిక ఖర్చు నుండి నియంత్రించుకోండి. లేకపోతే మీకు ధనం సరిపోదు. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ఈ రోజు, అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్ కౌంటర్ ఎదురుకావచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు పిస్తోంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు.

తుల రాశి : మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం. మీకు ప్రియమైన వారి బాహు బంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకుని మీజీవితభాగాస్వామితో బయటకు వెళతారు.అయినప్పటికీ, ఇద్దరిమధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి.

వృశ్చిక రాశి : ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటివరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీయొక్క ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది.

ధనస్సు రాశి : మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్‌ని ప్లాన్ చెయ్యండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఏరోజుకారోజు బ్రతకడం కోసం, సమయాన్ని, డబ్బును విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చుచేసే స్వభావాన్ని అదుపు చేసుకొండి. ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయములో సమస్యలకు తగిన పరిష్కారం ఆలోచిస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది.

మకర రాశి : మీరు ఈరోజు మీపనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు.పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్లముందకు వచ్చి నిలబడతాయి ఇవాళ. అలాగే ఈరోజు,మీ కుటుంబ సభ్యులు మిమ్ములను, మీరు చెప్పే విషయాన్ని పట్టించుకోరు.దీనివల్ల వారు మీయొక్క కోపానికి గురి అవుతారు.

కుంభ రాశి : మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందుతారు. ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు.

మీన రాశి : ఈ రోజు పిల్లలు, కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు.. మీయొక్క తీరికలేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపటం వలన మీరు ఏమి పోగొట్టుకుంటున్నారు తెలుసుకోగలుగుతారు. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులెవరైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు.

Tags:    

Similar News