మేష రాశి : ఈ రాశి వారికి మానసిక ప్రశాంతతో పాటు కుటుంబ సభ్యుల ఆసరా లభిస్తుంది. మీరు ఈరోజు ఎవరితో ఎక్కువగా గాసిప్స్ మాట్లాడకండి. దీనివల్ల మీకు చెడు జరిగే ప్రమాదం ఉంది
వృషభ రాశి : నేడు ఈ రాశి వారు కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాకే కమిట్ అవ్వండి. అలాగే స్నేహితులు వల్ల లాభాన్ని పొందుతారు.
మిథున రాశి : ఈరోజు, గ్రహచలనం రీత్యా, ప్రేమ వ్యవహారాలలో కొంత అప్సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు. కానీ మీ బెటర్ హాఫ్‌తో క్వాలీటీ టైమ్‌ని స్పెండ్ చేస్తారు.
కర్కాటక రాశి : నేడు ఈ రాశి వారు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించుట మంచిది. అలాగే మీ కుటుంబ సభ్యుల సలహా కూడా తీసుకోండి. అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది. ఇంకా మీరు బెటర్ డెసిషన్ తీసుకోవడానికి యూస్ అవుతుంది.
సింహ రాశి : ఈరోజు మీరు ఓ అద్భుతమైన సర్ ప్రైజ్‌ను అందుకుంటారు. మిమ్ములను మీరు ఒత్తిడి చేసుకోకుండా చాలా హ్యాపీగా ఉంటారు.
కన్యా రాశి : నేడు ఈ రాశి వారు అనుకోని ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇక ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, మీ బడ్జెట్‌కి కట్టుబడి ఉండండి. ఈవినింగ్ టైమ్‌లో అనుకోని శుభవార్త వింటారు.
తుల రాశి : బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువుల వలన కొంచెం ఒత్తిడి కలగవచ్చు. మీరు ఈ రోజు మీ తోబుట్టువులతో కలిసి సినిమాను కానీ , మ్యాచ్‌ను కానీ ఇంట్లో చూస్తారు.
వృశ్చిక రాశి : మీకు తెలిసిన వారి ద్వారా, కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్లడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
ధనస్సు రాశి : మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలు పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. కాకపోతే మీ మాటలు అదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ కఠినమైన మాటల వలన శాంతికి భంగం కలుగుతాయి.
మకర రాశి : ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. మీ కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి. కానీ అవసరానికి మించి ఖర్చు చేసే ఛాన్స్ ఉంది.
కుంభ రాశి : మీకు ఈ రోజు మొత్తం లాభాన్ని చేకూరుస్తుంది. అలాగే మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు. మీ యొక్క ప్రవర్తన వల్ల ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
మీన రాశి : మీ జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పని వల్ల మీకు ఈ రోజు బిగ్ రిలీఫ్ దొరుకుతుంది. అలాగే మీ జీవితంలో నిజమైన ఆనందాన్ని,సంతృప్తిని ఇచ్చే సందర్భాలు నేడు కలుగుతాయి.