మేష రాశి : బయట పనుల వల్ల అలసట ఒత్తిడి కలుగుతుంది. అలాగే దగ్గరి బంధువుల వల్ల వ్యాపారం లో సమస్యలు తగ్గి లాభాల బాట పట్టే అవకాశం ఉంది. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు. అలా చేయడం వల్ల సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. అలాగే జీవితంలోని పలు ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.
వృషభ రాశి: ఈ రోజు వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడంతో పాటు ప్రేమను పంచడం వల్ల ఇంట్లో ప్రశాంతత వాతావరణం కనిపిస్తుంది. మీరు ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకుండా మనస్సులో ఏది ఉంటే అది చెప్పటం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీ ప్రేమను బాగస్వామితో చెప్పడం వల్ల బంధం బలపడుతుంది.
మిథున రాశి: ఈ రోజు ఏదైనా తినేముందు జాగ్రత్తలు పాటించాలి. మూత పెట్టని ఆహార పదార్థాలు తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అయితే కొన్ని విషయాల్లో మీరు నమ్మిన వ్యక్తులతో మాట్లాడి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. అందువల్ల సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైనా గొడవలు జరిగినప్పుడు వాధించకుండా సైలెంట్‌గా ఉండాలి. లేదంటే చిక్కుల్లో పడతారు. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనుంది.
కర్కాటక రాశి: అంకిత భావం, కష్టపడి పని చేయడం వల్ల ఈ రోజు ఊహించని గుర్తింపు లభించడంతో పాటుగా పెద్ద వారి మెప్పు పొందుతారు. అది ఆర్థిక లాభాలు తీసుకువస్తుంది. ఈ రోజు మీరు ఇతరులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. అలాగే జీవిత భాగస్వామి తో మీ టీనేజీ రోజుల్లో జరిగిన సన్నివేశాలు పంచుకుంటారు. వ్యాపారస్తులు లాభాలు పొందాలని ఎప్పటినుంచో అనుకుంటున్న కోరిక ఈ రోజు నెరవేరుతుంది.
సింహ రాశి: ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వాల్సివస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో బాండ్ మీ రాయించుకుని ఇవ్వండి. అలా కాకుండా అడిగిన వెంటనే నమ్మకంతో ఇచ్చారంటే చిక్కుల్లో పడతారు. కొన్ని కారణాల వల్ల కొంత సమయాన్ని టెన్షన్‌గా గడుపే అవకాశం ఉంది. విద్యార్థులు, ఉపాధ్యాయులతో సబ్జెక్టుల్లో అర్థం కాని విషయాలు చర్చించి చదువుల్లో రాణించే ప్రయత్నాలు చేస్తారు. ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు విద్యార్థులు సబ్జెక్టుని అర్థం చేసుకుని చదువుపై ఆసక్తి కనబరుస్తారు.
కన్యా రాశి: ఇన్నాళ్లు ఆర్థిక సమస్యలు ఎదురుకున్నప్పటికీ ఈ రోజు లాభాలను చూస్తారు. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు వచ్చేలా కొందరు ప్రయత్నించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు మీకు అప్పగించిన పనులు పూర్తి చేయడం వల్ల మీ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.
తులా రాశి: గతంలో మీకు ప్రియమైన వారితో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. అయితే అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండటం మంచిది. అనుకోని బిల్లులు ఖర్చు పెంచుతాయి. ఇతరులను మురిపించే మీ గుణం రివార్డులు తెచ్చిపెడతాయి. అలాగే ఎక్కువ సమయాన్ని టీవీ చూడటానికే కేటాయిస్తారు. కానీ అది అంత మంచిది కాదు. కాబట్టి జీవిత భాగస్వామితో అద్భుత సమయాన్ని గడపడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వృశ్చిక రాశి: విలాసాలకు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా ఉండాలి. లేదంటే ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల వల్ల కలహాలు వస్తాయి. కాబట్టి కుటుంబ సభ్యులకు ఆర్ధిక విషయాలు దాపరికం లేకుండా చెప్పాలని వివరించండి. వ్యాపారస్తులు వారి సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడం వల్ల కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. అలాగే జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దీంతో ఈ రోజంతా మూడీగా మారుతుంది.
ధనుస్సు రాశి: టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండడం వల్ల మానసిక దృఢత్వం పెరుగుతుంది. అదృష్టం ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఖాళీ సమయంలో ఎన్నో రోజులుగా వాయిదా పడుతున్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
మకర రాశి: కొన్ని ముఖ్యమైన పనులు ఈరోజే చేయాలని ఒత్తిడికి గురవుతారు. అందువల్ల టెన్షన్‌తో వణుకు వస్తుంది. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. ప్రేమ సక్సెస్ అయి వివాహానికి సిద్ధపడతారు. ఏదైనా పనిని ఇతరులకు అప్పగించే ముందు దాని పూర్తి సమాచారం మీ దగ్గర కూడా ఉంచుకోండి.
కుంభ రాశి: కొద్ది కాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు, మీ ప్రియురాలు/ప్రియుడు ఈ రోజు ప్రేమ సాగరం లో మునిగి తేలుతారు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఈ ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతులుగా చూస్తుంది. అలాగే ఆనందకరమైన సమయాన్ని గడపడంతో పాటు మనస్పర్థలు తొలగి పోతాయి.
మీన రాశి: తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆలోచించి మీ ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి. మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొన్ని టెన్షన్ కారణంగా ఇంటికి దూరంగా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమస్యలు వస్తే ఇంట్లో వారితో చర్చించి సలహాలు తీసుకోవాలి కానీ దూరంగా పోవడం అంత మంచిది కాదు ప్రమాదాలు జరగవచ్చు.