Today's Horoscope : ఈ రోజు రాశి ఫలాలు (29-9-2024)

ఈ రాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.

Update: 2024-09-28 23:30 GMT

మేష రాశి : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు వస్తుంది. ఈ రాశి వారు వారి కెరీర్‌లో మంచి పురోగతికి అందుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులు ఈ రోజు పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలను గడిస్తారు. ఈ రోజు బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు.

వృషభ రాశి : ఈ రాశి వారు ఈ రోజు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కలహాలు జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. ఎదుటి వారితో సంభాషించే సమయంలో ఆచి తూచి మాట్లాడాలి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు.

మిథున రాశి : ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలించి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశి వారు తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి రావాల్సిన బకాయిలు తిరిగి వస్తాయి. సామాజిక సేవలో ముందుంటారు. వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. కుటుంబ వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలో విజయం సాధించేందుకు కష్టపడాల్సి ఉంటుంది.

సింహ రాశి : ఈ రాశి వారు వ్యాపారంలో పురోగతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ రాశి వారు వారి తోబుట్టువులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఆర్ట్స్ స్ట్రీమ్ విద్యార్థులకు విద్యారంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి.

కన్య రాశి : ఈ రాశి వారు వ్యాపారంలో కొంత నష్టాన్ని చవిచూస్తారు. ఆర్థిక విషయాలలో నిరాశ చెందవలసి ఉంటుంది. ఈ రాశి వారు వారి విలువైన సమయాన్ని వృధా చేస్తారు. ఉద్యోగులు తమ సహోద్యోగులతో ఆనందంగా తమ పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యంతో పాటు కుటుంబం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి.

తుల రాశి : ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయి. మీరు మీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పని చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తుల కొనుగోలుకు పెట్టుబడులు పెట్టేందుకు శుభదినం.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఈ రోజు దినచర్యను నెమ్మదిగా ప్రారంభిస్తారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగార్ధులకు ఈరోజు వేరే కంపెనీ నుంచి మంచి ఆఫర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకు వివాహాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు.

ధనుస్సు రాశి : ఈ రాశి వారు ఈ రోజు శుభవార్త వింటారు. రావాల్సిన బకాయిలు అందుతాయి. ఈ రోజు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చును చేస్తారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎవరితోనూ వాదించకండి. వ్యాపార రంగంలో ఉన్నవారు లాభాలను గడిస్తారు. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి.

మకర రాశి : ఈ రాశి విద్యార్ధులు ఈ రోజు చదువుల పట్ల ఆసక్తి కనబరుస్తారు. భవిష్యత్తు గురించి పూర్తి స్పష్టతతో ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారు పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. ఆర్థిక స్థితి బలపడుతుంది. ఎక్కడైనా రుణాలు తీసుకుని ఉంటే బాకీ చెల్లించేస్తారు.

కుంభ రాశి : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో వాగ్వాదం పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఉపాధ్యాయుల ఆశీస్సులను తీసుకుంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో కొన్ని స్వల్ప మార్పులతో మంచి లాభాలను గడిస్తారు. ఈ రాశి వారు విదేశాల్లో ఉన్న బంధువుల నుండి కొన్ని శుభవార్తలు వినవచ్చు.

మీన రాశి : ఈ రాశి వారు పెండింగ్ లో ఉన్న న్యాయపరమైన పనులను పూర్తి చేస్తారు. వివాహితులకు జీవిత భాగస్వామి మద్దతు ప్రతి రంగంలో ఉంటుంది. ఈ రాశి వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఆ రోజు దానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు వేరే కంపెనీ నుంచి మంచి ఆఫర్లు రావచ్చు. ఈ రోజు ఈ రాశి వారు మతపరమైన కార్యక్రమాలతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగస్తులు సమస్యల నుంచి బయటపడతారు.


Similar News