Today's Horoscope : ఈ రోజు రాశి ఫలాలు (28-9-2024)

ఈ రాశి వారికి ఈ రోజు ఆహ్లాదకరమైన రోజు.

Update: 2024-09-27 23:30 GMT

మేష రాశి : ఈ రాశి వారికి ఈ రోజు ఆహ్లాదకరమైన రోజు. ఈ రాశి వారు ప్రియమైన వారితో మరపురాని సమయాన్ని కూడా గడపవచ్చు. ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలను గడిస్తారు. నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఈ రోజు బంధుమిత్రులతో వినోదభరితమైన క్షణాలు గడిపే అవకాశం ఈ రాశివారికి లభిస్తుంది.

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి పరంగా అనుకూలమైన రోజు. మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీరు స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి విజయవకాశాలు అధికంగా ఉంటాయి. బంధుమిత్రులతో సమన్వయం పాటించాలి. కొన్ని విషయాల పై వాగ్వాదం జరగవచ్చు. ఈ రాశి వారు ఈ రోజు అనుకోని సమాచారం వినే అవకాశం ఉంది.  

మిథున రాశి : ఈ రాశి వారికి ఈ రోజు సామాజిక, రాజకీయ రంగాలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఈ రాశివారు ఈ రోజు సహోద్యోగులతో సరదాగా ఉంటారు. జీవిత బాగస్వామి పనుల్లో సహకారం అందిస్తారు. ఈ రోజు ఈ రాశివారు కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు విలువైన వస్తువులు, ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి.  

కర్కాటక రాశి : ఈ రాశి వారు ఈ రోజు తమ పనుల్లో పురోగతిని సాధిస్తారు. ఈ రాశివారు చేసే  ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఈ రాశివారు ఉద్యోగం, వ్యాపారంలో ప్రయోజనాలను పొందుతారు. ఈ రోజు ఈ రాశి వారు స్నేహితులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.  

సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు తమ పని, ఆర్థిక విషయాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో  సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ రోజు నియమ నిబంధనలు విస్మరిస్తే భవిష్యత్తులో నష్టపోవాల్సి వస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు.

కన్య రాశి : ఈ రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు. ఈ రాశి విద్యార్థులు విద్యా రంగంలో పురోగతి సాధిస్తారు. ఈ రాశి వారు ఈ రోజు ఉపాధ్యాయులు, సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. ఈ రాశి వారు కార్యాలయంలో మంచి పేరును పొందుతారు. వ్యాపారంలో సంపాదన బాగుంటుంది. రుణం కోసం ప్రయత్నించే వ్యక్తులు రుణాలను పొందుతారు. 

తుల రాశి : ఈ రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న  ముఖ్యమైన పనులు కొన్ని పూర్తి కావడంతో  ఊపిరి పీల్చుకుంటారు. ఈ రోజు వీరి గౌరవం కూడా పెరుగుతుంది. తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయి. ఈ రాశివారు గతంలో పెట్టిన  పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. విద్యార్థులు ఈరోజు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. 

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం కలుగుతుంది. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.  ఈ రోజు ఏదైనా సామాజిక కార్యక్రమంలో చేరవచ్చు. ఈ రోజు ఈ రాశి వారు కార్యాలయంలో స్నేహితులు, సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. సేల్స్ మార్కెటింగ్‌లో నిమగ్నమైన వ్యక్తులు ఈరోజు సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ముఖ్యమైన ఒప్పందాన్ని ఖరారు చేయడం ఆనందంగా ఉంటుంది.  

ధనుస్సు రాశి : ఈ రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరమైన రోజు. మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేస్తారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఈ రోజు ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత ఉంటుంది.  

మకర రాశి : ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ దినంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. ఈ రోజు  కార్యాలయంలో మరింత జాగ్రత్తగా పని చేయవలసి ఉంటుంది. ఎందుకంటే అజాగ్రత్త కారణంగా కొన్ని పొరపాట్లు జరగవచ్చు. మీరు ఈ రోజు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. ఉద్యోగం మార్చడానికి లేదా కొత్త ఉద్యోగం పొందడానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజు విజయం సాధిస్తారు. మీరు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభ రాశి : ఈ రాశి వారు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. కార్యాలయంలో  గౌరవం పెరుగుతుంది. ఏదైనా చట్టపరమైన వివాదం ఉంటే ఈ రోజు మీరు అందులో విజయం సాధిస్తారు. ఈరోజు బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. మీరు ఈరోజు మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఈ రోజు మీరు మీ కోపాన్ని, మాటలను అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది.

మీన రాశి : ఈ రాశి వారికి ఈ రోజు ప్రోత్సాహకరమైన రోజు. ఈ రోజు మీరు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీరు ఈరోజు విద్యారంగంలో మెరుగైన పనితీరును కనబరుస్తారు. అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్యం కూడా ఈరోజు మెరుగవుతుంది. మీరు పోగొట్టుకున్న కొన్ని వస్తువులు ఈరోజు కనుగొంటారు. పిల్లల ప్రవర్తన, సహకారంతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఆఫర్‌ల కారణంగా, మీరు మీ బడ్జెట్‌కు మించి కొనుగోళ్లు చేయవచ్చు. మీరు ఈరోజు ఏదైనా మతపరమైన ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా పొందవచ్చు.


Similar News