Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు(26-08-2024)
డబ్బు పరిస్థితి, ఆర్థిక సమస్యలు టెన్షన్‌కి కారణమవుతాయి.
మేష రాశి: డబ్బు పరిస్థితి, ఆర్థిక సమస్యలు టెన్షన్‌కి కారణమవుతాయి. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్ములను ఈరోజు బాధిస్తాయి. కావున మీరు హాస్పిటల్‌కి వెళ్లి ధనాన్ని ఖర్చుచేయవలసి ఉంటుంది. మీ టీమ్‌లో అత్యంత చీకాకు పెట్టే వ్యక్తే ఈ రోజు ఉన్నట్టుండి ఎంతో మేధావిగా మారిపోతాడు .
వృషభ రాశి: మీకు మీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని, సరళతను పెంచుతుంది. కానీ అదే సమయంలో మీ లోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష, పగ ద్వేషం వంటివాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి. కుటుంబంలో ఏవరిదగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి. లేనిచో వారు మీ పై న్యాయ పరమైన చర్యలు తీసుకోగలరు.
మిథున రాశి: ఈ రోజు మీ చుట్టు పక్కల్లో ఉన్న ఒకరు మిమ్ములను ఆర్థిక సహాయం చేయమని అడగవచ్చును. వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేనిచో నష్టం తప్పదు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీకు ప్రోత్సాహాన్ని అందించుతుంటారు.
కర్కాటక రాశి: ఈరోజు మీకు, బోలెడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు. కమిట్ అయితే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. క్రొత్త ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందీ రోజు.
సింహ రాశి: ఈ రోజు మీ కుటుంబ సభ్యుల నుంచి అందే ఒక మంచి సలహా, మీకు మానసిక వత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతివ్రేళ్ళనుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. మిమ్మల్ని ఇష్టపడి, మరియు శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. సీనియర్లనుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి.
కన్యా రాశి: మీ శ్రీమతి వ్యవహారాలలో అనవసరంగా తల దూర్చకండి. అది ఆమెకు, కోపం తెప్పించవచ్చు. మీ పనులేవో మీరు చూసుకోవడం మంచిది. వీలైనంత తక్కువగా జోక్యం ఉండడం మంచిది. లేకపోతే, అది ఆధారపడి పోయేలా తయారు చేస్తుంది. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి.
తులా రాశి: ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే క్రుంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లు, కొంత విచారం ఉండడం అవసరం. అలాగ ఉన్నప్పుడే, మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయి మీ మూడ్‌ని మార్చుకోండి. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి, అది మీకు నమ్మకమైన రీతిలో అధికమొత్తాలను రాబోయే రోజుల్లో తెచ్చిపెడుతుంది. ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించగలదు. అలాగే విభిన్నమైన రొమాన్స్‌ని అనుభూతి చెందనున్నారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇతరుల ఒత్తిడికి లోనుకాకండి.
వృశ్చిక రాశి: ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకొండి, లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు. మీరు అనవసర వాగ్వివాదాలకు సమయాన్ని వృధా చేస్తారు. రోజు చివర్లో ఇది మీయొక్క విచారానికి కారణం అవుతుంది.
ధనుస్సు రాశి: జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకొండి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్ధిక సమస్యలు ఎదురుకుంటున్నారో వారికి ఎక్కడనుండి ఐన మీకు ధనం అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది.
మకర రాశి: ఈ రోజు ఇంట్లో ఏవైనా మార్పులు చేసేముందు, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకొండి. లేకుంటే అది తరువాత కోపాలను, విచారాలను తేవచ్చు. ఉన్నచోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడదోయగలదు ప్రేమ. మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజిది. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం చూస్తారు. ఇది మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చి పెడతారు.
కుంభ రాశి: తల్లి కాబోయే మహిళలు, గచ్చుమీద నడిచేటప్పుడు, మరింత శ్రద్ధ వహించాల్సి ఉన్నది. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. స్నేహితుడు సహాయపడుతూ, చాలా సమర్థిస్తూ ఉంటాడు. ఆఫీసులో ఈ రోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు. మీ బెటర్ హాఫ్‌ను తరచూ సర్ ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధ పడవచ్చు.
మీన రాశి: మీరు యోగాతో, ధ్యానంతో రోజుని ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. అలాగే మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చేయవలసి ఉన్నది. స్నేహితులు, మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు. మీకు బాగా కావలసిన వారికి, సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్టను ఈ రోజు మీరు చవిచూడనున్నారు.