రాశిఫలాలు.. నేడు 12 రాశులకు ఎలా ఉన్నదంటే?
ఈరోజు ఈరాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. నేడు పని ఒత్తిడి మిమ్ముల్ని చికాకు పడేలా చేస్తుంది. ఈరోజు ఈ రాశి వారు దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మేష రాశి : ఈరోజు ఈరాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. నేడు పని ఒత్తిడి మిమ్ముల్ని చికాకు పడేలా చేస్తుంది. ఈరోజు ఈ రాశి వారు దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ అవి లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సాయంత్రం వేళ మీరు ఎక్కువ సంతోషాన్ని అనుభవిస్తారు.
వృషభ రాశి : ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈ రాశి వారు సెక్యులేషన్ ద్వారా అధికలాభాలు పొందుతారు. మీరు నేడు ఏదైనా టెంపుల్కి వెళ్లడం గ్రహరిత్యా ఉంది. అందువలన మానసిక ప్రశాంతతను పొందుతారు. నేడు భాగస్వాములతో కొత్త వ్యాపారం పెట్టడానికి అనుకూలించే రోజు. అందరూ లాభాలు పొందుతారు.మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణం కాగలవు.
మిథున రాశి : మీ ఖర్చులను అదుపు చెయ్యండి. ఈ రోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చుఅయిపోకుండా చూసుకొండి. మీవిచ్చలవిడి ఖర్చుదారీ తనం గల జీవన విధానం, ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు తీసుకొస్తుంది. భాగస్వామ్యంతో క్రొత్తగా వ్యాపారం మొదలుపెట్ట డానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశమున్నది. కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. ఈరోజు చాలా బాగుంటుంది.మీకొరకు మీరుబయటకువెళ్లి ఆహ్లాదంగా గడపండి.దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది.
కర్కాటక రాశి : గ్రహచలనం రీత్యా, అనారోగ్యంనుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలారోజులుగా రుణాలకోసము ప్రయత్నిస్తున్నమీకు ఈరోజు బాగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంద. దూర ప్రయాణలు ఇబ్బందులు తీసుకోస్తాయి. ఈ రోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూర్చనుంది. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.
సింహ రాశి :ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. గతంలో మీకు ప్రియమైన వారితోగల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా, మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. ఈరోజు ఉద్యోగరంగాల్లో ఉన్నవారికి వారియొక్క కార్యాలయాల్లో చాలా సమస్యలు ఎదురుకొనవలసి ఉంటుంది.మీరు తెలియకుండా తప్పులు చేస్తారు.ఇది మీయొక్కఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణము అవుతుంది.ఈరోజు ట్రేడురంగాల్లో ఉన్నవారికి సాధారణముగా ఉంటుంది. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే, ఇతరులు చెప్పిన సలహాను వినండి. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు.
కన్యారాశి : ఈ రాశివారు ఈరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. లేదా, ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.
తుల రాశి :ఆరోగ్యం దృష్ట్యా కొంత జాగ్రత్త అవసరం. ఆర్థిక లాభాలు అనేక మార్గాలనుండి వస్తుంటాయి. ఇంటివద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేరు పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి, బిజీగా ఉంచగలదు. తమకు ప్రియమైన వారితో కొద్దిరోజుల శెలవుపై ఉన్నవారికి బోలెడంత మరపురాని మధుర సమయాన్ని గడప గలుగుతారు. ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ మీరు భాగస్వాములనుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు.
వృశ్చిక రాశి :ఆరోగ్యం బాగుంటుంది. చేపట్టిన పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది. ఆర్థిక లాభాలు అనేక మార్గాలనుండి వస్తుంటాయి. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. ఈరోజు మీయొక్క వ్యక్తిత్వము ఇతరులకంటే భిన్నంగా ఉంటుంది.మీరు ఎక్కువసమయము ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు.ఈరోజు మీకు ఖాళిసమయము దొరుకుతుంది ,కానీ మీరు మీయొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది.
ధనస్సు రాశి : ఈ రోజు ఈరాశి వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆర్థికంగా బాగుంటుంది. నీడు మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి, అది మీకు నమ్మకమైన రీతిలో అధికమొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. అనుకోని అతిథి రాకతో మా ప్లాన్లన్నీ పాడు కావచ్చు. అయినా సరే, ఈ రోజు మీకు బాగానే గడుస్తుంది.
మకర రాశి :ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అది మీకు కాస్త చికాకును కలిగిస్తుంది.
కుంభ రాశి :ఈరోజు మీయొక్క ఆర్థికస్థితి అనుకూలంగా ఉండదు.ఇందువలన ధనాన్ని మీరు పొదుపుచేయలేరు. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి, మీ తలదించుకునేలాగ చేయడం జరుగుతుంది. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీ రు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు.
మీన రాశి :కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.