Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (03-09-2024)
నేడు మేష రాశి వారు ఇతరులచే విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది.
మేష రాశి: నేడు మేష రాశి వారు ఇతరులచే విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. కాగా ఎవరి మాటలకు పట్టించుకోకుడా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ సోదరీమణులకు పెళ్లి సంబంధాలు వస్తాయి. కానీ మీ సిస్టర్ మీకు దూరం అవుతుందన్న బాధ మీలో కలుగుతుంది.తరచూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. నేడు కష్టపడి పని చేయండి. తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఇవాల మీ భాగస్వామి మిమ్మల్ని ఎక్కువగా పట్టించుకుంటారు. మనసు ప్రశాంతంగా ఉండటం కోసం హనుమాన్ చాలీసా చదవండి.
వృషభ రాశి: ఆర్థికపరంగా నష్టపోతారు.కాగా నేడు ఆలోచించి తక్కువగా ఖర్చు చేయండి. ఈ రాశివారు ఇవాళ తోబుట్టువుల నుంచి సహాయం పొందుతారు. మంచి పేరున్న వారితో పరిచయాలు పెరుగుతాయి. అలాగే ఎవరిని అంత సులభంగా నమ్మకండి. మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని తలదించుకునేలా చేస్తారు. బంధుత్వాలనే వదులుకునేంతగా గొడవలు తలెత్తుతాయి.
మిథున రాశి: నేడు రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై దృష్టి సారించండి. మంచి ఫలితం దక్కుతుంది. స్నేహితులతో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకోండి. ప్రశాంతంగా గడపడండి.దీంతో మానసిక ప్రశాంతత దొరుకుతుంది.నేడు మధ్యాహ్నం సమయం నుంచి ఎక్కువగా సంతోషంగా ఉంటారు. ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు ఎద్కొంటారు. ఆఫీసులో మంచి గుర్తింపు పొందుతారు. ఖాళీ సమయంలో ఇంటిని క్లీన్ చేస్తుంటారు.
కర్కాటక రాశి: మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇవాళ మిమ్మల్ని చాలా బాధపెడతాయి. ఏం చేయ్యాలో తెలియక అయోమయంలో పడిపోతారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించండి. ఈ రాశి వారికి విలువలు, ఆచార సంప్రదాయాలు ఎక్కువగా తెలిసి ఉంటుంది. డబ్బును పొగు చేసి, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించండి. నేడు మాంసాహారం తీసుకోవడం మంచిది కాదు.
సింహ రాశి: ధ్యానం, యోగా చేయడం ఆరోగ్యానికి మంచిది. ఆర్థికంగా చాలా లాభాలు చేకూరుతాయి. నేడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజంతా ఎంతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులను హగ్ చేసుకుంటారు. అందరి పట్ల మంచి దృష్టితో ఉంటారు. ఎదుటివారిపై ప్రేమను కురుపిస్తారు. మీ భాగస్వామి నేడు మీతో చాలా ఇష్టంగా మాట్లాడుతారు.ఎదుటివారికి సహాయం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది.
కన్యా రాశి: దీర్ఘకాలిక వ్యాధులతో నేడు బాధపడుతుంటారు. ఆసుపత్తిలో ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవల్సిన ఉంటుంది. పాత బంధాలు దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయి. జీతం విషయంలో మంచి జరుగుతుంది. వార్షిక ఇంక్రిమెంట్ తో శాలరీ పెరుగుతుంది. దీంతో మీలో సంతోషం ఉప్పొంగిపోతుంది. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు.కానీ మనీ విషయంలో జాగ్రత్త పడడం మేలు. వృద్ధ బ్రహ్మాణులకు ఫుడ్ సాయం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
తులా రాశి: ఈ రాశివారు భయాన్ని వీడడం మంచిది. మీ భయమే మిమ్మల్ని రిస్క్‌లో పడేలా చేస్తుంది. నేడు ఇతరుల వద్ద డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా ఖర్చు పెట్టాలి? అనే విషయాల గురించి చర్చించండి. మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయండి. ఫైనాన్షియల్ గా బాగానే ఉంటారు. మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఆనందాన్ని పొందుతారు.నేడు ప్రతి రోజూ ప్రశాంతతను పొందాలంటే ఒంటరిగా మీకు నచ్చిన ప్లేస్ లో సాయంత్రం వేళ గడపండి.
వృశ్చిక రాశి: పని ఒత్తిడి కలుగుతుంది. దీనికి కారణం కుటుంబంలోని సమస్యలే. కానీ ఆదాయం వస్తుంది. ఆఫీసులో అందరితో చాలా సంతోషంగా గడుపుతారు. మిమ్మల్ని ద్వేషించినవారికి జస్ట్ హాయ్ చెప్పండి తమ మనసు ఇట్టే కరిగిపోతుంది. కుటుంబంతో సరిగ్గా గడపలేడు. బంధువులతో గొవడ కావచ్చు. వికలాంగులకు సహాయం చేయడం మంచిది.అంతా మంచే జరుగుతుంది.
ధనుస్సు రాశి: మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే ధ్యానం చేయండి. మీ తోబుట్టువులు మిమ్మల్ని డబ్బులు అడుగుతారు. కానీ భవిష్యత్తులో ఆర్థిక విషయాల కారణంగా గొడవలు అవుతాయి. ప్రేమలో నిరాశకు గురవుతారు. నేడు అంతా బిజీగా గడుపుతారు. ఆర్థిక సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది. నేడు ఈ రాశి వారికి ఒపిక అనేది చాలా ముఖ్యం. మీ పట్ల మీ భాగస్వామి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.
మకర రాశి: ఎప్పటి నుంచో మీరు చేసిన పొదుపు నేడు మిమ్మల్ని కాపాడుతుంది. కానీ తెలియకుండా అయిన ఖర్చులు మిమ్మల్ని బాధపెడుతుంటాయి. ఇంటికి ఎక్కువగా రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ వస్తుంటారు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నేడు మీ భాగస్వామితో మీ ప్రేమను పంచుకోండి. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందకండి. ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ ఇంటి కిటికీలో ఏదైనా ఒక పువ్వును ఉంచడం ద్వారా ఆర్థిక పరంగా మెరుగుపడతారు.
కుంభ రాశి: శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన ఆహారాన్ని తీసుకోండి. నేడు డబ్బు విలువ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో గొడవలు కాకుండా జాగ్రత్త పడండి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇవాళ ఎక్కువగా సంగీతాన్ని వినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. చెవుల నిండా పాటలు వింటూ ఆనందాన్ని పొందుతారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆ రోజంతా చాలా సంతోషంగా గడిచిపోతుంది. మీకు ఇష్టమైన పనుల్ని చేయండి.
మీన రాశి: ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. మీకు ఇష్టమైన వారు నేడు మీకు బహుమతులు ఇస్తారు. బంధువులు మీ సమస్యల్నీ వారి నెత్తిమీద వేసుకుంటారు. తమ ప్రాబ్లమ్స్ లాగా ఫీల్ అవుతుంటారు. ఇవాళ చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతుంటారు. ఏ ప్రోగ్రామ్‌లోనైనా పాల్గొనడానికి ఉత్సాహం కనబరుస్తారు. మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఖాళీగా ఉన్న సమయంలో పరిష్కారాలను ఆలోచిస్తారు. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకుంటారు. సాయంత్రం పూట ఫ్రెండ్స్‌తో యబటికెళ్లి గడపండి. ఈ రోజు మీ జీవితం ఎంతో అద్భుతంగా కొనసాగుతుంది.