Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (02-10-2024)

నేడు మేష రాశి వారి ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతాయి.

Update: 2024-10-01 21:45 GMT

మేష రాశి: నేడు మేష రాశి వారి ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతాయి. కానీ మీకు తెలియకుండానే ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఇవాళ మంచి మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషపెడతారు. భాగస్వామితో ప్రశాంతంగా గడుపుతారు. ఏ కార్యక్రమాలైన మీ అంచనాలకు మించి లబ్దిని చేకూరుస్తాయి.

వృషభ రాశి: ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి. వ్యాపారాల విషయాలను గమనించుకుంటూ ఉండండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నేడు మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది.

మిథున రాశి: మీ భాగస్వామి ఇబ్బంది పెడుతారు. దీంతో మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆఫీసులో గుర్తింపు పొందుతారు. మిమ్మల్ని చికాకు తెప్పిస్తూన్న బాధ్యతల్ని నేడు మీ బంధువులు వారిమీద వేసుకుంటారు. మీరు ఊహించలేని లాభాలు వస్తుంటాయి.

కర్కాటక రాశి: వృత్తిపరంగా కూడా లాభాలు పొందుతారు. మీ ఇంట్లో పండగ వాతావరణం నెలకుంటుంది. ఎదుటివారు మీతో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కచ్చితంగా కనిపిస్తుంది. శ్రోతలాగా మిగిలిపోవడం కన్నా. స్టేజ్ పైన ప్రసంగాలు, సెమినార్లు ఇస్తారు. కానీ మీరు కూడా వారితో కమ్యూనికేట్ అవ్వడం మంచిది. విద్య, ఉద్యోగం పరంగా అంతా మేలు జరుగుతుంది.

సింహ రాశి:  అనవసరపు ఖర్చులు పెట్టవద్దు. డబ్బు ఆదా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రాశివారు ఖర్చును తగ్గిస్తే బెటర్. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. కానీ చిన్న చిన్న విషయాల కారణంగా విచారడం మంచిది కాదు. మీ లైఫ్ లో నిజమైన ప్రేమను మిస్ అవుతారు. మీ భాగస్వామి ఆరోగ్యం పరంగా ఇబ్బందిపడతారు.

కన్యా రాశి: ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాగా ఈ రాశివారు అప్పులు చేయకుండా జాగ్రత్త పడడం మేలు. చెడు ఆలోచనలు మానుకోవడం మంచిది. మిమ్మల్ని ఇష్టపడేవారితో గడపుతారు.

తులా రాశి: మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఆనందంగా ఉంటారు.ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తారు. కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయండి. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కాగా జాగ్రత్త వహించండి. నేడు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి: ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం బెటర్. కుటుంబ సభ్యులకు సహాయపడండి. ప్రేమలో నిరాశకు గురవుతారు. ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులతో ఎక్కవ సమయం గడపటానికి ప్రయత్నించాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోండి. మీ భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు తెప్పిస్తుంది. మీరు పని చేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు.

ధనుస్సు రాశి: కానీ ఆర్థికపరంగా మీ ఆలోచనలు ముందుకు సాగవు. నేడు మంచి విజయాలు అందుకుంటారు. మీ భాగస్వామి నేడు మిమ్మల్ని పొగడటమే పనిగా పెట్టుకుంటాడు. కానీ తొందరగానే ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు. సాయంత్రం వేళ స్నేహితులతో గడపండి.

మకర రాశి: శుభవార్తలు వింటారు. కేవలం మిమ్మల్నే కాకుండా కుటుంబం మొత్తం సంతోషపడే క్షణాలను అనుభవిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు. ఈ రాశి వారు నేడు ఏ పని చేసిన విజయం సాధిస్తారు. మీ భాగస్వామి ఎంతో ఎనర్జీగా, ప్రేమగా కనిపిస్తారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో సినిమాకు వెళ్తారు. ఇవాళ వారితో ఎక్కువ సమయం కేటాయిస్తారు.

కుంభ రాశి: ఆర్థికంగా నష్టపోతారు. అనవసరపు ప్రయాణాలు చేయవద్దు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మీ భాగస్వామితో కలిసి డబ్బు ఎక్కువగా ఖర్చుపెడతారు. కానీ సంతోషంగా డే మొత్తం గడుపుతారు. ఈ రోజు మీకు ఇష్టమైన పనుల్ని చేయండి. అవసరమైన వాటికోసం మాత్రమే డబ్బు ఖర్చు పెట్టండి. విహార యాత్రలకు వెళ్తారు. దీంతో మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు.

మీన రాశి: దీంతో సంతోషంగా ఉంటారు. మత్తు కలిగించే హార్డ్ డ్రింకులకు దూరంగా ఉండటం మేలు. ఫ్రెండ్స్‌తో సాయంత్రం పూట సమయం గడుపుతారు. కాగా వివాదాలు రేగకుండా చూసుకోండి. ఉద్యోగం కోసం తెగ కష్టపడుతుంటారు. ఎక్కువగా పార్కులో గడపడానికి ఇష్టపడతారు. మీ ప్రేమికులతో గొడవలు అయ్యే అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ భాగస్వాములతో ఢిపరెంట్‌గా కొత్తకొత్త ప్లాన్స్ చేస్తారు.


Similar News