Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (17-09-2024)

నేడు మేష రాశి వారు ఫైనాన్షియల్‌గా బెనిఫిట్స్ ఉంటాయి.

Update: 2024-09-16 21:45 GMT

మేష రాశి: నేడు మేష రాశి వారికి ఫైనాన్షియల్‌గా బెనిఫిట్స్ ఉంటాయి. మానసికంగా ఆహ్లాదాన్ని పొందుతారు. ఫ్రెండ్స్‌తో సరదాగా బయటికెళ్లేవారు ఎలాంటి అవరోధాలు ఎదుర్కోకుండా సంతోషాన్ని గడుపి ఇంటికి వస్తారు. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. ఇతరులు మీపై స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు. మీకు చెప్పకుండా రిలేషన్స్, ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు.

వృషభ రాశి: వీరికి డబ్బు విలువ బాగా తెలిసి ఉంటుంది. నేడు ఈ రాశివారికి ఆర్థికపరంగా అంతా బాగానే ఉంది. వీరు డబ్బు పొగు చేసి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగిస్తారు. ఇవాళ మీరు ఒంటరిగా గడపడం మంచిది. ఇతరులతో తొందరపడి అన్ని విషయాలు పంచుకోకుండా ఉంటే బెటర్.

మిథున రాశి: ఇవాళ ఈ రాశి వారు అనుకోకుండా ఈవెంట్లలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని మీట్ అవుతారు. వీరు ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ పని వల్ల మీ చుట్టూ ఉన్నవారిని మెప్పిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో భాగస్వామితో గొడవ పడతారు.ఆర్థిక విషయంలో ఒత్తిడికి గురవుతారు. ఈ రాశివారు అరటి చెట్టును ఆరాధించడం మంచిది.

కర్కాటక రాశి: ఈ రాశి వారు రిలేషన్స్‌తో ఎక్కువగా గడుపుతారు. పైస విలువ తెలిసి ఉంటుంది. మీ భాగస్వామి మీపై ఎనలేని ప్రేమ కురిపిస్తారు. వృత్తిపరంగా కూడా లాభాలు పొందుతారు. కానీ పలు అనవసరమైన పనుల వల్ల మీ సమయాన్ని వృథా అవుతుంది.

సింహ రాశి: నేడు మీ పిల్లల స్కూల్ ప్రాజెక్టు పనిలో సహాయపడుతారు. అలాగే ముఖ్యమైన పర్సన్స్‌తో మాట్లాడేటప్పుడు చెవులను, కళ్లను, కళ్లను తెరిచి ఉంచండి. ఆరోగ్యాన్ని కాపాడాలనుకుంటే సిగరెట్‌కు దూరంగా ఉండాలి. తెలియని వారి సలహాల వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఎదుటివారిపై ప్రేమను కురుపిస్తారు. మీ పాత మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

కన్యా రాశి: బాగా పరపతి ఉన్న వారి మద్ధతు మీకు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాగా ఈ రాశివారు నేడు ఫ్రెండ్స్ వద్ద కొంత ధనాన్ని అప్పుగా అడుగుతారు. ఫ్రెండ్స్‌ పట్ల గాఢమైన ప్రేమను చూపిస్తారు. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. మీ ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టాలంటే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి. నేడు భూ వ్యవహారాలను డీల్ చేస్తారు.

తులా రాశి: తోబుట్టువుల వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇవాళ మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయాల్సి ఉంటుంది. మీకు దగ్గరి వారు మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకునే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఆనందంగా ఉంటారు. చిల్లర వ్యాపారులు, టోకు వ్యాపారులకు నేడు మంచి జరుగుతుంది. మీ గతంలోని తప్పులను తెలుసుకుని బాధపడుతారు.

వృశ్చిక రాశి: నేడు మీ జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆలోచిస్తారు. ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులతో ఎక్కవ సమయం గడపటానికి ప్రయత్నించాలి. మీ నిర్లక్ష్యం తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఖాళీగా ఉన్న టైంలో కొత్తగా ఆలోచించే సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.సమయం ఎంత వృథా చేస్తున్నారో తెలుసుకోలేదు. నేడు కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం మంచిది.

ధనుస్సు రాశి: మీ మాటను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ కఠినమైన మాటలు ఇతరుల్ని బాధపెడతాయి. ధ్యానం, యోగా చేయండి. ముందువెనక ఆలోచించకుండా కాస్ట్లీ ఐటెమ్స్ కొనడం ఆపేయండి. ఆర్థిక సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది. డబ్బు ఎలా సంపాదించాలో కొత్త మార్గాలు వెతకండి. ఖాళీ సమయంలో ఏవైనా పనుల మీద దృష్టి పెట్టండి. మీ భాగస్వామితో గొడవకు మీ రిలేషన్స్ కారణం అయ్యే అవకాశం ఉంటుంది.

మకర రాశి: నేడు ఈ రాశివారికి బస్సు ప్రయాణాలు అంతగా కలిసి రాదు. ఆర్థికపరంగా బాగానే ఉంది. మీరు ఎవరికైన అప్పుగా ఇచ్చి మనీ నేడు వసూలు చేసుకుంటారు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందడం మానుకోండి. ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీకు ఇష్టమైన వారితో కలిసి ఐస్ క్రీమ్, చాక్లెట్స్ తింటారు.

కుంభ రాశి: ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాగా జాగ్రత్త పడటం మేలు. ఈ రోజు మీకు ఇష్టమైన పనుల్నిచేస్తారు. పిక్‌నిక్ వెళ్తారు. అవసరమైన వాటికోసం మాత్రమే డబ్బు ఖర్చు పెట్టండి. మీ తల్లిండ్రలతో, మీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడండి. నేడు మీ లక్ష్యాలను చేరుకుంటారు. నేడు అనుకోకుండా మంచి పనులు చేస్తారు. అది జీవితంలో మర్చిపోలేనిదిగా మిగిలిపోతుంది.

మీన రాశి: ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. సాయంత్రం ఫ్రెండ్స్‌తో ఫోన్లో ముచ్చటిస్తారు. చిల్లర వ్యాపారులకు టోకు వ్యాపారులకు ఇవాళ మంచి రోజు. ఈ రోజు మీ జీవితం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితాన్ని బంధువులు తరచూ పాడు చేస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబం గురించి బాగా ఆలోచించుతారు. ఎక్కువగా తల్లిదండ్రులతో గడపడానికి ఇష్టపడతారు.  


Similar News