Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (12-11-2024)
వీరు అద్భుతమైన వ్యాపార లాభాలు పొందుతారు.
మేష రాశి: వీరు అద్భుతమైన వ్యాపార లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఉంటుంది. ఆర్థికంగా దూసుకుపోతారు. మీ ఇంట్లో పండగ వాతావరణం నెలకుంటుంది. విద్య, ఉద్యోగం పరంగా అంతా మేలు జరుగుతుంది. సింగిల్ గా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు.
వృషభ రాశి: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసరపు ఖర్చులు పెట్టవద్దు. డబ్బు ఆదా చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఫ్రెండ్స్ మీరు ఆపదలో ఉంటే ఆదుకుంటారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. మీ లైఫ్ లో నిజమైన ప్రేమను మిస్ అవుతారు. సెమినార్లు, ఉపన్యాసాల్లో పాల్గొంటారు. కానీ చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందవద్దు.
మిథున రాశి: ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. కానీ మీరు ఊహించలేని లాభాలు వస్తుంటాయి. మీ మిత్రులను కలుసుకుంటారు. నేడు ప్రశాంతంగా గడుపుతారు. ఆర్థికంగా అంతా బానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడుపుతారు.
కర్కాటక రాశి: నేడు మేష రాశి వారు డబ్బుల విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంది. కానీ మీకు తెలియకుండానే ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి. భాగస్వామితో ప్రశాంతంగా గడుపుతారు. ఇవాళ మంచి మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషపెడతారు. ఏ కార్యక్రమాలైన మీ అంచనాలకు మించి లబ్దిని చేకూరుస్తాయి.
సింహ రాశి: నేడు మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి. కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వ్యాపారాల విషయాలను గమనించుకుంటూ ఉండండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు.
కన్యా రాశి: ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోవడం ముఖ్యం. ప్రేమలో నిరాశకు గురవుతారు. మీరు పని చేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు. సాంగ్స్ ఎక్కువగా వింటారు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో ఎక్కవ సమయం గడపటానికి ప్రయత్నించాలి. మీ భాగస్వామి అపారమైన ప్రేమ చూపిస్తారు.
తులా రాశి: నేడు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయండి. కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఆనందంగా ఉంటారు. ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తారు. రాత్రిపూట ఫోన్ ఎక్కువగా మాట్లాడుతారు.
వృశ్చిక రాశి: ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎక్కువ కెలరీలు ఉన్న ఫుడ్ తీసుకోవడం మేలు. అలాగే ఆర్థికంగా నష్టపోతారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టినవారు నష్టపోతారు. కుటుంబ సభ్యుల సపోర్ట్ బాగా ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.
ధనుస్సు రాశి: జీవితం పట్ల కొత్తగా ప్లాన్స్ చేస్తారు. విహార యాత్రలకు వెళ్తారు. దీంతో మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆర్థికంగా లాభాలు చేకూరుస్తాయి. అనవసరపు ప్రయాణాలు చేయవద్దు. ఈ రోజు మీకు ఇష్టమైన పనుల్ని చేయండి. డబ్బు ఎక్కువగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి. మీ భాగస్వామితో కలిసి ఎగ్జైటింగ్ పనులు చేస్తారు.
మకర రాశి: శుభవార్తలు వింటారు. కానీ పలు సమస్యలు వస్తాయి. నేడు ఎక్కువగా కష్టపడుతారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో సినిమాకు వెళ్తారు. ఆలోచించి మాట్లాడాలి. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు కొనితెచ్చుకునే అవకాశం ఉంది.
కుంభ రాశి: విలాసవంతమైన జీవితం, ఖర్చులపట్ల ఆందోళన చెందుతారు. ఫ్రెండ్స్‌తో సాయంత్రం పూట సమయం గడుపుతారు. కానీ గొడవలు రాకుండా చూసుకోండి. పెద్దల సలహాలు తీసుకోండి. ఉద్యోగం అవకాశాలు వస్తాయి. ఎక్కువగా పార్కులో గడపడానికి ఇష్టపడతారు. వివాహ జీవితంలో పలు గొడవలు అవుతాయి.
మీన రాశి: అప్పు ఇచ్చిన వారి దగ్గర తిరిగి పొందుతారు. తొందరగానే ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు. స్నేహితులతో గడపుతారు. సాయంత్రం వేళ మీ భాగస్వామితో ఎక్కువగా గడుపుతారు. పార్టీలకు హాజరవుతారు.