Margasira Masam: మార్గశిర మాసంలో ఆ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందా?

హిందూ ధర్మంలో కార్తీకమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Update: 2024-12-04 05:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : హిందూ ధర్మంలో కార్తీకమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. డిసెంబర్ రెండవ తేదీన ఈ మాసం ముగిసింది. ఇక, డిసెంబర్ మూడవ తేదీ నుంచి మార్గశిర మాసం ( Margasira Masam ) ప్రారంభమైంది. ఈ మాసం అంటే లక్ష్మీదేవితో పాటు శివుడు, శ్రీమహావిష్ణువులకు చాలా ఇష్టం. ఈ మాసంలో శ్రీమహావిష్ణువు అనుగ్రహం కొన్ని రాశుల వారిపై ఉండటం వలన విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మకర రాశి

మకర రాశి వారికీ ఈ సమయం బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా, మీరు మొదలు పెట్టిన పనులను ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు రావడంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పెట్టుబడులు పెట్టె వారికీ ఇది మంచి సమయం. కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికీ ఈ మాసంలో అదృష్టం రెట్టింపు అవుతుంది. అలాగే, ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. కెరీర్‌ పరంగా వస్తున్న సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఉద్యోగం సంపాదిస్తారు. వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు వస్తాయి. అలాగే, విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News