ఈ నెలలో ఈ రాశుల వారు జాగ్రత్త.. సైలెంట్‌గా ఉండకపోతే సమస్యలు తప్పవు!
జ్యోతిష్య శాస్త్రంలో కుజుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ గ్రహం ప్రతి 45 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుతుంది. ఈ క్రమంలోనే జులై12న కుజుడు తన రాశిని మార్చుకోనున్నాడు
దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్రంలో కుజుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ గ్రహం ప్రతి 45 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుతుంది. ఈ క్రమంలోనే జులై12న కుజుడు తన రాశిని మార్చుకోనున్నాడు. మేష రాశిలో నుంచి వృషభ రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. దీని వలన కొన్ని రాశుల వారికి కష్టాలు తప్పవు. కాగా, కుజుడు రాశి మార్చుకోవడం వలన ఏ రాశి వారికి కష్టాలు, సమస్యలు వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంభ రాశి : ఈ రాశివారిపై కుజుడి ప్రభావం అధికంగా పడనుంది. కుజుడు రాశి మార్చుకోవడం వలన ఈ రాశివారు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. చికాకులు అధికం అవుతాయి. ఏ నిర్ణయం తీసుకున్నా, అది వీరికి కలిసి రాదు. ఏం మాట్లాడినా, అది గొడవలకే దారి తీస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంటా బయట ఇబ్బందికర సమస్యలు తలెత్తుతాయి.
మిథున రాశి : మిథున రాశి వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురు అవుతాయి. శత్రువులు అధికం అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం రావడం చాలా కష్టం అవుతోంది. విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
కర్కాటక రాశి : కుజుడు రాశి మార్చుకోవడం వలన కర్కాటక రాశి వారికి అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు. ఆర్థికపరమైన సమస్యలు ఎదురు అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.(నోట్ : పై వార్తను ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)