హీరో మోటార్స్ కంపెనీపై కేసు వేసిన హోండా!
దిశ, సెంట్రల్ డెస్క్: పదేళ్ల క్రితం వరకూ కలిసి వ్యాపారం చేసిన రెండు కంపెనీల మధ్య ఇప్పుడు గొడవ మొదలైంది. అవే..హీరో, హోండా. 1984 నుంచి సంయుక్తంగా అనేక విజయవంతమైన మోడళ్లను మార్కెట్లోకి తెచ్చిన ఈ రెండు కంపెనీలు ఒప్పందం గడువు పూర్తవడంతో 2010లో విడిపోయాయి. భారత మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు కంపెనీలు విడివిడిగానే కొత్త మోడల్ బైకులను విడుదల చేస్తూ పోటీపడ్డాయి. 2010 నుంచి రెండు కంపెనీలు పోటాపోటీగా బైకులను మార్కెట్లోకి […]
దిశ, సెంట్రల్ డెస్క్: పదేళ్ల క్రితం వరకూ కలిసి వ్యాపారం చేసిన రెండు కంపెనీల మధ్య ఇప్పుడు గొడవ మొదలైంది. అవే..హీరో, హోండా. 1984 నుంచి సంయుక్తంగా అనేక విజయవంతమైన మోడళ్లను మార్కెట్లోకి తెచ్చిన ఈ రెండు కంపెనీలు ఒప్పందం గడువు పూర్తవడంతో 2010లో విడిపోయాయి. భారత మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు కంపెనీలు విడివిడిగానే కొత్త మోడల్ బైకులను విడుదల చేస్తూ పోటీపడ్డాయి. 2010 నుంచి రెండు కంపెనీలు పోటాపోటీగా బైకులను మార్కెట్లోకి తెచ్చినప్పటికీ.. కొంతవరకూ రెండు కంపెనీల బైకులు ఒకేరకంగా ఉండేవి. ఈ క్రమంలోనే హోండా కంపెనీ డిజైన్ ఉల్లంఘన కేసు పెట్టి హీరో మోటార్స్ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. హోండా మూవ్ డిజైన్‌ను కాపీ చేసిందని, దాన్ని ఎలక్ట్రిక్ హీరో డాష్ అనే మోడల్‌ను తీసుకొచ్చిందని, ఇది ఖచ్చితంగా కాపీరైట్స్ ఉల్లంఘించినట్టే అని హోండా కంపెనీ వాదిస్తున్నట్టు ఆటోమొబైల్ రంగంలోని వారు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి హీరో మోటార్స్ కంపెనీపై ఢిల్లీ హైకోర్టులో హోండా కంపెనీ కేసు నమోదు చేసింది. కోర్టుకిచ్చిన పిటిషన్‌లో హీరో కంపెనీ డాష్ ఎలక్ట్రిక్ బైక్ హెడ్‌లైట్లు, వెనక కవర్‌తో సహా అనేక డిజైన్ భాగాలను కాపీ చేసిందని పేర్కొంది. తమ డిజైన్‌ను కాపీ కొట్టిన డాష్ బైక్ మోడల్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలంటూ కోర్టును కోరింది. హోండా కంపెనీ పిటిషన్‌ను వీడియో కాన్‌ఫరెన్స్ ద్వారా విచారణకు స్వీకరించినట్టు వెల్లడించింది.