ఆ రాష్ట్రాల వారు ఇక 14 రోజులు ఉండాల్సిందే

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన క్వారంటైన్ నిబంధనలో తాజాగా మార్పులు చేసింది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కర్నాటకకు వచ్చే ప్రయాణికులకు గతంలో ఏడు రోజుల క్వారంటైన్ నిబంధన విధించింది యడ్డీ సర్కార్. తాజాగా ఈ నిబంధనను 14 రోజులకు పొడిగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి స్వాబ్ శాంపిల్స్ తీసుకోవడం […]

Update: 2020-07-06 12:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన క్వారంటైన్ నిబంధనలో తాజాగా మార్పులు చేసింది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కర్నాటకకు వచ్చే ప్రయాణికులకు గతంలో ఏడు రోజుల క్వారంటైన్ నిబంధన విధించింది యడ్డీ సర్కార్. తాజాగా ఈ నిబంధనను 14 రోజులకు పొడిగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి స్వాబ్ శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుందని, ఒకవేళ కరోనా ఉంటే హోం క్వారంటైన్‌లో ఉన్న 14 రోజులలోపు లక్షణాలు బయటపడే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News