గాంధీ ఆస్పత్రిలో అత్యాచార కేసు.. మంత్రుల కీలక ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ ఆసుపత్రి ఘటనలో నిందితులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం హోంమంత్రి కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, నగర సీపీ అంజనీకుమార్, అడిషనల్ సీపీ శిఖా గోయల్, డీసీపీ కల్మేశ్వర్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావులతో మహమూద్ అలీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘటనపై తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన […]
దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ ఆసుపత్రి ఘటనలో నిందితులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం హోంమంత్రి కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, నగర సీపీ అంజనీకుమార్, అడిషనల్ సీపీ శిఖా గోయల్, డీసీపీ కల్మేశ్వర్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావులతో మహమూద్ అలీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘటనపై తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు సీఎం కేసీఆర్ మార్గదర్శకాలతో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేసి, వేగంగా పరిష్కరించాలని, చట్ట పరంగా చర్యలు చేపట్టాలని మంత్రులు పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని త్వరలో పట్టుకుంటామని సీపీ స్పష్టం చేశారు.