కల్నల్ సంతోష్ మృతిపై హోం మంత్రి సంతాపం
దిశ, క్రైమ్‌బ్యూరో: భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో దేశ రక్షణకు విశిష్ట సేవలు అందిస్తోన్న కల్నల్ సంతోష్ బాబు మరణం పట్ల రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనొక పత్రికా ప్రకటన మంగళవారం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట ప్రాంతానికి చెందిన సంతోష్ బాబు కల్నల్ స్థాయికి ఎదిగి భారతదేశానికి సేవలందిస్తూ గాల్వాన్ వ్యాలీలో వీరమరణం పొందటం శోచనీయమన్నారు. అతి చిన్న వయసులో దేశ రక్షణకు […]
దిశ, క్రైమ్‌బ్యూరో: భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో దేశ రక్షణకు విశిష్ట సేవలు అందిస్తోన్న కల్నల్ సంతోష్ బాబు మరణం పట్ల రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనొక పత్రికా ప్రకటన మంగళవారం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట ప్రాంతానికి చెందిన సంతోష్ బాబు కల్నల్ స్థాయికి ఎదిగి భారతదేశానికి సేవలందిస్తూ గాల్వాన్ వ్యాలీలో వీరమరణం పొందటం శోచనీయమన్నారు. అతి చిన్న వయసులో దేశ రక్షణకు అంకితమై, తన ప్రాణాలను త్యాగం చేసిన సంతోష్ బాబు ధన్యజీవి అని అన్నారు. ఆయన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు హోంమంత్రి మహమూద్ అలీ సానుభూతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఢిల్లీలో నున్న సంతోష్ సతీమణితో, సూర్యాపేటలోని తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడి ఓదార్చారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారి కిషన్ రెడ్డి కోరారు.