మైండ్ పనిచేయలేదు.. అందుకే ఆ పాత్ర చేయాల్సి వచ్చింది : నటి కామెంట్స్
దిశ, సినిమా : హాలీవుడ్ యాక్ట్రెస్ వియోలా డేవిస్ అమెరికా 44వ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా పాత్రలో నటించడంపై ఓ షోలో స్పందించింది. అమెరికన్ లీడర్‌షిప్ రీఫ్రేమింగ్‌ను వైట్ హౌజ్ హార్ట్ అయిన మహిళ కోణంలో సినిమా ఉండబోతుండగా.. వియోలా తన పాత్రలో నటించడంపై ఇంతకు ముందు మిచెల్ ప్రశంసల వర్షం కురిపించింది. వియోలా ఏం చేస్తుందో దానికి తను అర్హురాలిని కాదని, ప్యాషన్‌తో ఈ పాత్ర చేస్తున్న తను వందశాతం న్యాయం […]
దిశ, సినిమా : హాలీవుడ్ యాక్ట్రెస్ వియోలా డేవిస్ అమెరికా 44వ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా పాత్రలో నటించడంపై ఓ షోలో స్పందించింది. అమెరికన్ లీడర్‌షిప్ రీఫ్రేమింగ్‌ను వైట్ హౌజ్ హార్ట్ అయిన మహిళ కోణంలో సినిమా ఉండబోతుండగా.. వియోలా తన పాత్రలో నటించడంపై ఇంతకు ముందు మిచెల్ ప్రశంసల వర్షం కురిపించింది. వియోలా ఏం చేస్తుందో దానికి తను అర్హురాలిని కాదని, ప్యాషన్‌తో ఈ పాత్ర చేస్తున్న తను వందశాతం న్యాయం చేస్తుందని అభిప్రాయపడింది.
మిచెల్ కాంప్లిమెంట్స్‌పై స్పందించిన వియోలా ఈ క్యారెక్టర్ ప్లే చేయడాన్ని తాత్కాలిక పిచ్చిగా అభివర్ణించింది. ఈ రోల్‌కు కమిట్ అయ్యే టైంలో తన మైండ్ పనిచేయలేదనుకుంటా, అందుకే ఒప్పుకున్నానన్న 55 ఏళ్ల యాక్ట్రెస్.. ఇక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేనని తెలిపింది. మిచెల్‌ను దేవతతో పోలుస్తూ భారీ కాంప్లిమెంట్స్ ఇచ్చిన వియోలా ‘ప్రతీ ఒక్కరికి తన గురించి తెలుసు, ప్రతీ ఒక్కరు తనను ప్రొటెక్ట్ చేయాలనుకుంటారు. నేను చేయాల్సింది ఈ పాత్రకోసం నేను ఇవ్వగలిగినంత బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇవ్వడమే’ అని చెప్పింది.
ఈ పాత్రను తెరపై పోషించేందుకు మిచెలాతో కొన్నిగంటల పాటు చర్చించానని వివరించింది. కొన్నిసార్లు కొందరు ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా ఆ పాత్రలో జీవించలేరు కానీ అలా చేసినప్పుడు చాలా భయపెట్టేదిగా ఉంటుందని అభిప్రాయపడింది వియోలా.