డెన్మార్క్ కంపెనీతో హెచ్ఎండీఏ ఒప్పందం
దిశ, తెలంగాణ బ్యూరో: ఒకప్పుడు జంట నగరాలకు తాగునీరందించిన హుస్సేన్‌సాగర్‌ను అదే స్థాయిలోకి తీసుకువచ్చేందుకు ప్రయోగాలు చేస్తున్న హెచ్ఎండీఏ.. మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నీటి వ్యర్థాలు జలాశయంలోకి చేరకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి ఈ రంగంలో అనుభవం ఉన్న డెన్మార్క్ కంపెనీ ‘డెస్మి’తో అవగాహన ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా 9నెలల పాటు పైలెట్ ప్రాజెక్టు నిర్వహణకు డెస్మి అంగీకారం తెలిపింది. వచ్చే 2నెలల్లో ‘పైలెట్ ప్రాజెక్టు’ కార్య రూపంలోకి తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఒకప్పుడు జంట నగరాలకు తాగునీరందించిన హుస్సేన్‌సాగర్‌ను అదే స్థాయిలోకి తీసుకువచ్చేందుకు ప్రయోగాలు చేస్తున్న హెచ్ఎండీఏ.. మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నీటి వ్యర్థాలు జలాశయంలోకి చేరకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి ఈ రంగంలో అనుభవం ఉన్న డెన్మార్క్ కంపెనీ ‘డెస్మి’తో అవగాహన ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా 9నెలల పాటు పైలెట్ ప్రాజెక్టు నిర్వహణకు డెస్మి అంగీకారం తెలిపింది. వచ్చే 2నెలల్లో ‘పైలెట్ ప్రాజెక్టు’ కార్య రూపంలోకి తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే పికెట్ డ్రైన్(నాలా) కిమ్స్ హాస్పిటల్ సమీపంలో హుస్సేస్‌సాగర్ జలాశయంలోకి ప్రవేశించే ప్రదేశంలో ఈ ‘పెలెట్ ప్రాజెక్టు’ ను అమలుచేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందు కోసం త్వరలో డెస్మి కంపెనీ ప్రతినిధులు, వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ ఇండియా ప్రతినిధులు, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు హుస్సేస్సాగర్లోకి నీటిని తీసుకొచ్చే నాలాలను జాయింట్ తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. డెస్మి కంపెనీ రూపొందించిన ‘బూమ్ బారియర్ అండ్ అటోమేటెడ్ రైసర్సిస్టెమ్’ ద్వారా వచ్చే నీటి వ్యర్థాలను ఎంట్రీ పాయింట్ వద్దనే ఎప్పటికప్పుడు ఏరివేసి కేవలం నీటిని మాత్రమే హుస్సేన్‌సాగర్ జలాశయంలోకి ప్రవేశించేలా ఈ యంత్రం పనిచేస్తుందని అధికారులు వివరించారు.