ఆ మసీదు కింద హిందూ దేవాలయం..? సర్వేకు కోర్టు ఆర్డర్
వారణాసి: యూపీలో వారణాసిలోని గ్యాన్‌వాపీ మసీదుపై సర్వే చేయాలని స్థానిక కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ప్రస్తుత కట్టడం ఇది వరకే ఉన్న కట్టడంపై నిర్మించారా? లేక మార్పులు చేర్పులు చేసి నిర్మించారా? అనే విషయాలను కనుగొనడమేనని వివరించింది. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడైనా హిందు దేవాలయం ఉండేదా? అనే అంశాన్నీ కనుక్కోవడే సర్వే ప్రధాన ఉద్దేశమని తెలిపింది. ఇందుకోసం ఆర్కియాలజీలో పట్టు ఉన్న ఐదుగురు నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని, ఇందులో […]
వారణాసి: యూపీలో వారణాసిలోని గ్యాన్‌వాపీ మసీదుపై సర్వే చేయాలని స్థానిక కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ప్రస్తుత కట్టడం ఇది వరకే ఉన్న కట్టడంపై నిర్మించారా? లేక మార్పులు చేర్పులు చేసి నిర్మించారా? అనే విషయాలను కనుగొనడమేనని వివరించింది. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడైనా హిందు దేవాలయం ఉండేదా? అనే అంశాన్నీ కనుక్కోవడే సర్వే ప్రధాన ఉద్దేశమని తెలిపింది. ఇందుకోసం ఆర్కియాలజీలో పట్టు ఉన్న ఐదుగురు నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని, ఇందులో ఇద్దరు మైనార్టీలు ఉండేలా చూసుకోవాలని ఏఎస్ఐకు సూచించింది.
వారణాసిలో గ్యాన్‌వాపీ మసీదు, ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ టెంపుల్ పక్కపక్కనే ఉంటాయి. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు ఇక్కడున్న విశ్వేశ్వరుడి ఆలయాన్ని కూల్చి వేసి ఆ శకలాలతోనే మసీదును నిర్మించారని సుమారు మూడు దశాబ్దాల క్రితం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారిస్తూ న్యాయస్థానం తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఆ వాదనకు ఆధారాలేవీ లేవని, తాము అలహాబాద్ హైకోర్టును ఆశ్రయిస్తామని యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు స్పందించింది.