లైంగిక వేధింపులు.. ప్రముఖ టీవీ నటుడు అరెస్ట్..

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ టీవీ నటులు ఈ లైంగిక వేధింపుల కేసులలో అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారుతుంది. ఇటీవల మైనర్ బాలికను కారులో లైంక వేధింపులకు గురిచేసాడన్న ఆరోపణలతో హిందీ టీవీ నటుడు పెర్ల్ వి పూరి  అరెస్ట్ అయిన విషయం మరువక ముందే మరో టీవీ నటుడు మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ‘కసౌతి జిందగీ కే’, ‘హతీమ్’, ‘మాట్ […]

Update: 2021-07-03 02:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ టీవీ నటులు ఈ లైంగిక వేధింపుల కేసులలో అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారుతుంది. ఇటీవల మైనర్ బాలికను కారులో లైంక వేధింపులకు గురిచేసాడన్న ఆరోపణలతో హిందీ టీవీ నటుడు పెర్ల్ వి పూరి అరెస్ట్ అయిన విషయం మరువక ముందే మరో టీవీ నటుడు మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

‘కసౌతి జిందగీ కే’, ‘హతీమ్’, ‘మాట్ పితా కే చార్నన్ మెయిన్ స్వర్గ్’ వంటి సీరియళ్లతో మంచి పేరు తెచ్చుకున్న ప్రాచీన్ చౌహాన్ ని లైంగిక వేధింపుల కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పలు టెలివిజన్ షోలతో హిందీ బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న ఈ 42 ఏళ్ల ఈ నటుడు ఇటీవల “ప్యార్ కా పంచ్” అనే వెబ్ సిరీస్‌లో కనిపించాడు. ఇక ప్రాచీన్ అరెస్ట్‌తో హిందీ బుల్లితెర షాక్‌కు గురైంది. అత‌ని అరెస్ట్‌కి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

Tags:    

Similar News