NH-7 పై విరిగిపడిన కొండచరియలు..
దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీవర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో లొతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీగా కురుస్తున్న వర్షాల వలన పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా చమోలీ జిల్లాలోని గౌచార్ ప్రాంతంలో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. NH-7 జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఆ సమయంలో అటుగా వాహనాలు వెళ్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీవర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో లొతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీగా కురుస్తున్న వర్షాల వలన పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా చమోలీ జిల్లాలోని గౌచార్ ప్రాంతంలో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి.
NH-7 జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఆ సమయంలో అటుగా వాహనాలు వెళ్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది కొండచరియలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు.