హిజ్రాలు హల్చల్.. పోలీస్ స్టేషన్లో బట్టలిప్పేసి హంగామా..
దిశ, అల్వాల్: పెండ్లి వేడుకలో హిజ్రాలు బట్టలు విప్పి హల్చల్ చేసిన సంఘటన గురువారం నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నరసింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక నగర్లో నివాసం ఉంటున్న స్వరూప(40) కూరగాయల వ్యాపారం చేసుకుంటుంది. ఆమె కుమారుడి వివాహం గురువారం ఇంట్లో జరుగుతుండగా.. ఇద్దరు హిజ్రాలు వచ్చి డబ్బులు డిమాండ్ చేయడంతో రూ.3 వేలు ఇచ్చి పంపించారు. తర్వాత మరో నలుగురు హిజ్రాలు మోక్ష, తమన్నా, సోనీలు వచ్చి రూ.5 వేలు ఇవ్వాలని […]
దిశ, అల్వాల్: పెండ్లి వేడుకలో హిజ్రాలు బట్టలు విప్పి హల్చల్ చేసిన సంఘటన గురువారం నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నరసింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక నగర్లో నివాసం ఉంటున్న స్వరూప(40) కూరగాయల వ్యాపారం చేసుకుంటుంది. ఆమె కుమారుడి
వివాహం గురువారం ఇంట్లో జరుగుతుండగా.. ఇద్దరు హిజ్రాలు వచ్చి డబ్బులు డిమాండ్ చేయడంతో రూ.3 వేలు ఇచ్చి పంపించారు. తర్వాత మరో నలుగురు హిజ్రాలు మోక్ష, తమన్నా, సోనీలు వచ్చి రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వమని చెప్పడంతో హిజ్రాలు దాడికి పాల్పడ్డారు.
అక్కడితో ఆగకుండా హిజ్రాలు బట్టలు విప్పేసి బూతులు తిడుతూ ఇంటిముందు వేసిన టెంట్ కూల్చి కుర్చీలను ధ్వసం చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సంఘటనా స్థలానికి చేరుకుని హిజ్రాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడకూడా ఆగకుండా నగ్నంగా పోలీసులను తిడుతూ హిజ్రాలు హల్చల్ చేశారు. దీంతో నలుగురు హిజ్రాలపై 506, 448 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు ఐపిసి 188,51(b)డిసాస్టర్ మెనేజ్మెంట్ కింద మరో కేసు నమోదు చేశారు