ఆ నగరంలో ఠారెత్తిస్తున్న ఎండలు
తమిళనాడు రాజధాని చెన్నైలో ఒకవైపు కరోనా విజృంభిస్తోంటే.. మరోవైపు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో నగర వాసులు ఉక్కపోతకు అల్లాడుతున్నారు. చెన్నైలో బుధవారం మధ్యాహ్నం 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు అక్కడి ప్రాంతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో నగరవాసులు పగటి పూట బయటకు రావడానికే జంకుతున్నారు. లాక్ డౌన్ సడలించినా తీవ్రమైన ఎండలతో జనసంచారం లేక చెన్నై రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఇక, రాష్ట్రంలో ప్రధాన పట్టణాలైన వేలూరు, తిరువళ్లూర్, తిరుత్తణిలో 41 డిగ్రీల ఉష్ణోగత్ర […]
తమిళనాడు రాజధాని చెన్నైలో ఒకవైపు కరోనా విజృంభిస్తోంటే.. మరోవైపు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో నగర వాసులు ఉక్కపోతకు అల్లాడుతున్నారు. చెన్నైలో బుధవారం మధ్యాహ్నం 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు అక్కడి ప్రాంతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో నగరవాసులు పగటి పూట బయటకు రావడానికే జంకుతున్నారు. లాక్ డౌన్ సడలించినా తీవ్రమైన ఎండలతో జనసంచారం లేక చెన్నై రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఇక, రాష్ట్రంలో ప్రధాన పట్టణాలైన వేలూరు, తిరువళ్లూర్, తిరుత్తణిలో 41 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది.